ఒకటి కాదు, రెండు కాదు.. రోజుకు మూడు సార్లు బ్రష్​ చేయాలి- ఎందుకంటే..!-why brushing in thrice a day mainly in the night is important for heart health see details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఒకటి కాదు, రెండు కాదు.. రోజుకు మూడు సార్లు బ్రష్​ చేయాలి- ఎందుకంటే..!

ఒకటి కాదు, రెండు కాదు.. రోజుకు మూడు సార్లు బ్రష్​ చేయాలి- ఎందుకంటే..!

Published Apr 27, 2025 01:05 PM IST Sharath Chitturi
Published Apr 27, 2025 01:05 PM IST

సాధారణంగా చాలా మందికి రోజులో రెండుసార్లు బ్రష్​ చేసే అలవాటు ఉండదు. కానీ రోజుకు మూడుసార్లు బ్రష్​ చేయాలని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా రాత్రి పూట పళ్లు తోముకుంటే గుండె సమస్యలు రావట!

ఓరల్​ హైజీన్​ని పట్టించుకోకపోతే గుండె వ్యాధులు వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉందని వివరిస్తున్నాయి.

(1 / 5)

ఓరల్​ హైజీన్​ని పట్టించుకోకపోతే గుండె వ్యాధులు వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉందని వివరిస్తున్నాయి.

సరిగ్గా బ్రష్​ చేయకపోతే నోటిలోని బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి ఇన్​ఫ్లమేషన్​కి దారితీయవచ్చు. దీని వల్ల దీర్ఘకాలంలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

(2 / 5)

సరిగ్గా బ్రష్​ చేయకపోతే నోటిలోని బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి ఇన్​ఫ్లమేషన్​కి దారితీయవచ్చు. దీని వల్ల దీర్ఘకాలంలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అందుకే రాత్రి పూట కచ్చితంగా బ్రష్​ చేయాలి. అంతేకాదు రోజులో కనీసం మూడుసార్లు బ్రష్​ చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. మూడుసార్లు బ్రష్​ చేయడంతో లోపల ఉన్న బ్యాక్టీరియా పోతుంది. కేవిటీ, గమ్​ వ్యాధులు, దుర్వాసనను దూరం చేస్తుంది.

(3 / 5)

సరిగ్గా బ్రష్​ చేయకపోతే కేవిటీ సహా ఇతర ఓరల్​ సమస్యలు వస్తాయి. పళ్లు పాడైపోతాయి.

(4 / 5)

సరిగ్గా బ్రష్​ చేయకపోతే కేవిటీ సహా ఇతర ఓరల్​ సమస్యలు వస్తాయి. పళ్లు పాడైపోతాయి.

బ్రష్​ చేయడమే కాదు ఎప్పటికప్పుడు డెంటల్​ చెకప్​కి కూడా వెళ్లాలి. పళ్లను టెస్ట్​ చేయించుకోవాలి. అప్పుడే సమస్యలను దూరం చేయవచ్చు.

(5 / 5)

బ్రష్​ చేయడమే కాదు ఎప్పటికప్పుడు డెంటల్​ చెకప్​కి కూడా వెళ్లాలి. పళ్లను టెస్ట్​ చేయించుకోవాలి. అప్పుడే సమస్యలను దూరం చేయవచ్చు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు