(1 / 7)
తంగలన్ మూవీ నటీమణి మాళవిక మోహనన్. పా రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్ ప్రధాన పాత్రల్లో నటించిన తంగలన్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ పీరియాడిక్ యాక్షన్ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. ఈ సమయంలో మాళవిక మోహనన్ నిన్న ఎక్స్ (ట్విట్టర్)లో ‘Ask Malavika’ అనే హ్యాష్ ట్యాగ్ తో అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు.
(2 / 7)
విక్రమ్ ను మొదటిసారి కలిసినప్పుడు ఎలా అనిపించింది? అని ఒక అభిమాని అడిగారు. దానికి మాళవిక.. విక్రమ్ ను మొదటిసారి కలిసినప్పుడు కొంచెం భయపడ్డానని చెప్పింది. 'నేను స్టంట్ చేయడం ఇదే తొలిసారి. విక్రమ్ అందరితో స్నేహంగా ఉంటారు. ఇతర నటీనటులకు ఎంతో సాయం చేస్తారు. ఆయన అద్భుతమైన సహనటుడు. విక్రమ్ అంటే నాకు చాలా గౌరవం' అని మాళవిక తెలిపింది.
(3 / 7)
పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఓ అభిమాని ప్రశ్నించాడు. దానికి మాళవిక 'నన్ను పెళ్లయిన వ్యక్తిగా చూడటానికి ఎందుకు తొందరపడుతున్నావు' అని సమాధానమిచ్చింది.
(4 / 7)
తంగలన్ గురించి ఒక్క మాట చెప్పమని అడిగినప్పుడు అది 'అద్భుతమైన సినిమా' అని మాళవిక బదులిచ్చింది. త్వరలోనే తన తరువాత సినిమా ప్రకటిస్తానని చెప్పింది.
(5 / 7)
'మాళవిక మేడమ్, ఇప్పటి వరకు మీరు చేయని పాత్ర ఏంటి?' అని అడిగిన ప్రశ్నకు మాళవిక 'గ్యాంగ్ స్టర్ 'గా అని చెప్పింది. ఆ పాత్ర చేయాలని ఉందని చెప్పింది.
(6 / 7)
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన తంగలన్ ఆగస్టు 15న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదలవుతుంది.
(7 / 7)
తంగలాన్ చిత్రంలో మాళవిక మోహనన్ మంత్రగత్తె పాత్రలో నటిస్తోంది .
ఇతర గ్యాలరీలు