Ladies Depression : మగవారితో పోలిస్తే.. ఆడవారు ఎందుకు ఎక్కువ డిప్రెషన్‌కు గురవుతారు?-why are women more prone to depression than men ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ladies Depression : మగవారితో పోలిస్తే.. ఆడవారు ఎందుకు ఎక్కువ డిప్రెషన్‌కు గురవుతారు?

Ladies Depression : మగవారితో పోలిస్తే.. ఆడవారు ఎందుకు ఎక్కువ డిప్రెషన్‌కు గురవుతారు?

Published Feb 17, 2025 03:01 PM IST Basani Shiva Kumar
Published Feb 17, 2025 03:01 PM IST

  • Ladies Depression : ఆడవారిది చాలా సున్నితమైన మనస్తత్వం. ఏ చిన్న సమస్య వచ్చినా డిప్రెషన్‌కు గురవుతుంటారు. మగవారితో పోలిస్తే.. స్త్రీలే ఎక్కువ నిరాశకు గురవుతుంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో ఓసారి చూద్దాం.

మహిళలు చాల సున్నితంగా ఉంటారు. చిన్న విషయాలను కూడా మనసులో పెట్టుకొని మానసిక ఒత్తిడికి గురవుతారు. సాంప్రదాయకంగా.. మహిళలు సంరక్షకులుగా, పోషకులుగా భావించబడతారు. ఇవి వారికి మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి.

(1 / 7)

(istockphoto)

మహిళల్లో రుతుక్రమం, గర్భధారణ, ప్రసవానంతరం, మెనోపాజ్ వంటి సమయంలో హార్మోన్ల స్థాయిల్లో మార్పులు జరుగుతుంటాయి. ఈ మార్పులు వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి.

(2 / 7)

మహిళలు కుటుంబం, ఉద్యోగం, పిల్లల పెంపకం వంటి అనేక బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించాల్సి వస్తుంది. దీనివల్ల వారు తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు.

(3 / 7)

గృహ హింస, లైంగిక వేధింపులు, లింగ వివక్ష వంటి సమస్యలు మహిళలను మానసికంగా కుంగదీస్తాయి. గృహ హింస, లైంగిక వేధింపులపై అవగాహన పెంచడం చాలా ముఖ్యం. ఈ సమస్యల గురించి మాట్లాడటం, బాధితులకు మద్దతు ఇవ్వడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చు.

(4 / 7)

ఆర్థిక సమస్యలు, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటివి మహిళల్లో ఆందోళనను పెంచుతాయి. పిల్లల సంరక్షణ బాధ్యతలు మహిళలపైనే ఎక్కువగా ఉండటం వల్ల.. వారు తమ కెరీర్‌ను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

(5 / 7)

కొన్ని రకాల శారీరక ఆరోగ్య సమస్యలు కూడా డిప్రెషన్‌కు దారితీస్తాయి. మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు శారీరక, మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది డిప్రెషన్‌కు దారితీస్తుంది.

(6 / 7)

డిప్రెషన్‌కు జన్యుపరమైన కారణాలు కూడా ఉండవచ్చు. కుటుంబంలో ఎవరికైనా డిప్రెషన్ ఉంటే, మహిళలకు కూడా వచ్చే అవకాశం ఉంది. సైకోథెరపీ, యాంటిడిప్రెసెంట్స్, జీవనశైలి మార్పులతో దీన్ని తగ్గించవచ్చు.

(7 / 7)

Basani Shiva Kumar

eMail
WhatsApp channel

ఇతర గ్యాలరీలు