Ladies Depression : మగవారితో పోలిస్తే.. ఆడవారు ఎందుకు ఎక్కువ డిప్రెషన్‌కు గురవుతారు?
- Ladies Depression : ఆడవారిది చాలా సున్నితమైన మనస్తత్వం. ఏ చిన్న సమస్య వచ్చినా డిప్రెషన్‌కు గురవుతుంటారు. మగవారితో పోలిస్తే.. స్త్రీలే ఎక్కువ నిరాశకు గురవుతుంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో ఓసారి చూద్దాం.
- Ladies Depression : ఆడవారిది చాలా సున్నితమైన మనస్తత్వం. ఏ చిన్న సమస్య వచ్చినా డిప్రెషన్‌కు గురవుతుంటారు. మగవారితో పోలిస్తే.. స్త్రీలే ఎక్కువ నిరాశకు గురవుతుంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో ఓసారి చూద్దాం.
(1 / 7)
మహిళలు చాల సున్నితంగా ఉంటారు. చిన్న విషయాలను కూడా మనసులో పెట్టుకొని మానసిక ఒత్తిడికి గురవుతారు. సాంప్రదాయకంగా.. మహిళలు సంరక్షకులుగా, పోషకులుగా భావించబడతారు. ఇవి వారికి మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి.
(istockphoto)(2 / 7)
మహిళల్లో రుతుక్రమం, గర్భధారణ, ప్రసవానంతరం, మెనోపాజ్ వంటి సమయంలో హార్మోన్ల స్థాయిల్లో మార్పులు జరుగుతుంటాయి. ఈ మార్పులు వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి.
(istockphoto)(3 / 7)
మహిళలు కుటుంబం, ఉద్యోగం, పిల్లల పెంపకం వంటి అనేక బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించాల్సి వస్తుంది. దీనివల్ల వారు తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు.
(istockphoto)(4 / 7)
గృహ హింస, లైంగిక వేధింపులు, లింగ వివక్ష వంటి సమస్యలు మహిళలను మానసికంగా కుంగదీస్తాయి. గృహ హింస, లైంగిక వేధింపులపై అవగాహన పెంచడం చాలా ముఖ్యం. ఈ సమస్యల గురించి మాట్లాడటం, బాధితులకు మద్దతు ఇవ్వడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చు.
(istockphoto)(5 / 7)
ఆర్థిక సమస్యలు, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటివి మహిళల్లో ఆందోళనను పెంచుతాయి. పిల్లల సంరక్షణ బాధ్యతలు మహిళలపైనే ఎక్కువగా ఉండటం వల్ల.. వారు తమ కెరీర్‌ను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
(istockphoto)(6 / 7)
కొన్ని రకాల శారీరక ఆరోగ్య సమస్యలు కూడా డిప్రెషన్‌కు దారితీస్తాయి. మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు శారీరక, మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది డిప్రెషన్‌కు దారితీస్తుంది.
(istockphoto)ఇతర గ్యాలరీలు