(1 / 6)
హైదరాబాద్ నగరంలో జరిగిన చాలా ప్రమాదాలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లు ప్రధాన కారణం. పాత లేదా సరిగా నిర్వహించని వైరింగ్, ఓవర్ లోడింగ్, లూజ్ కనెక్షన్ల వల్ల తరచుగా షార్ట్ సర్క్యూట్‌లు ఏర్పడతున్నాయి. ఆదివారం ఉదయం గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి కూడా షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.
(unsplash)(2 / 6)
చాలా కాలనీల్లో ప్రజలు అజాగ్రత్తగా ఉంటున్నారు. అగ్ని ప్రమాదానికి కారణమయ్యే వస్తువులను వాడటం, మండే పదార్థాలను సరిగా నిల్వ చేయకపోవడం వంటి నిర్లక్ష్యాల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.
(unsplash)(3 / 6)
అనేక భవనాల్లో సరైన అగ్నిమాపక వ్యవస్థలు ఉండటం లేదు. ఉన్నా అవి సరిగా పనిచేయకపోవడం లేదా వాటి నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ప్రమాదాలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న వాణిజ్య భవనాలు, 18 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న నివాస భవనాలకు ఎన్ఓసీ అవసరం లేదు. కాబట్టి వాటిలో చాలా వరకు అగ్నిమాపక భద్రతా చర్యలు చేపట్టడం లేదు.
(unsplash)(4 / 6)
హైదరాబాద్‌లో జనాభా సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల ఇరుకైన ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు నష్టం ఎక్కువగా ఉంటుంది. గుల్జార్ హౌస్‌లో జరిగిన ప్రమాదంలో.. భవనానికి ఒకే ఒక ఇరుకైన ప్రవేశ ద్వారం, ఒకే మెట్ల దారి ఉండటం కారణంగా రక్షణ చర్యలకు ఆటంకం కలిగించింది.
(unsplash)(5 / 6)
హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. దీని వల్ల కూడా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలాలకు చేరుకోవడం కష్టమవుతుంది. ఫలితంగా ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటోంది.
(unsplash)(6 / 6)
అగ్ని ప్రమాదాల నివారణ, ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం కూడా నష్టానికి కారణమవుతుంది. దీనిపై అగ్నిమాపక శాఖ అవగాహన కల్పించాలనే డిమాండ్లు ఉన్నాయి.
(unsplash)ఇతర గ్యాలరీలు