ఇండియా టెస్టు కెప్టెన్ ఎవరు? రోహిత్ నుంచి బ్యాటన్ ఎవరి చేతికి? రేసులో వీళ్లే! ఓ లుక్కేయండి-who will be the next indian cricket test team captain rohit retirement shubman gill bumrah rishabh pant kl rahul in race ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఇండియా టెస్టు కెప్టెన్ ఎవరు? రోహిత్ నుంచి బ్యాటన్ ఎవరి చేతికి? రేసులో వీళ్లే! ఓ లుక్కేయండి

ఇండియా టెస్టు కెప్టెన్ ఎవరు? రోహిత్ నుంచి బ్యాటన్ ఎవరి చేతికి? రేసులో వీళ్లే! ఓ లుక్కేయండి

Published May 08, 2025 10:17 AM IST Chandu Shanigarapu
Published May 08, 2025 10:17 AM IST

భారత టెస్టు క్రికెట్ లో ఓ శకం ముగిసింది. హిట్ మ్యాన్ ఎరాకు ఎండ్ కార్డు పడింది. రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. దీంతో తర్వాతి భారత టెస్టు కెప్టెన్ ఎవరనే చర్చ జోరందుకుంది. మరి రేసులో ఉన్న ప్లేయర్లెవరో ఓ లుక్కేయండి.

రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ కు గుడ్ బై పలికాడు. బుధవారం (మే 8) రిటైర్మెంట్ డిసిషన్ ప్రకటించాడు. రోహిత్ వీడ్కోలుతో టెస్టుల్లో భారత టీమ్ కు కొత్త కెప్టెన్ కావాల్సి వచ్చింది. మరి రోహిత్ నుంచి బ్యాటన్ అందుకునే కొత్త కెప్టెన్ ఎవరో చూడాలి.

(1 / 5)

(HT_PRINT)

టీమిండియా టెస్టు కెప్టెన్ రేసులో యంగ్ బ్యాటర్ శుభ్ మన్ గిల్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. యంగ్ ప్లేయర్ కు పగ్గాలు ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు టాక్. 32 టెస్టుల్లో శుభ్ మన్ 1,893 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా రాణిస్తున్నాడు గిల్.

(2 / 5)

(x/BCCI)

మొన్నటి వరకు కూడా తర్వాతి ఇండియన్ టెస్టు కెప్టెన్ ఎవరంటే బుమ్రా పేరే వినిపిచ్చింది. కానీ గాయాలు అతణ్ని దెబ్బకొడుతున్నాయి. ఇంగ్లాండ్ తో అయిదు టెస్టుల్లోనూ అతను పూర్తిగా ఆడే అవకాశాలు లేవు. అయినా బుమ్రా కెప్టెన్ ఛాన్స్ కొట్టిపారేయలేం. ఇప్పటికే మూడు టెస్టుల్లో అతను ఇండియాకు సారథ్యం వహించాడు.

(3 / 5)

(x/mufaddal_vohra)

యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేరు కూడా ఇండియా టెస్టు కెప్టెన్సీ రేసులో వినిపిస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో ఈ డైనమిక్ బ్యాటర్ రికార్డు గొప్పగా ఉండటమే అందుకు కారణం. కానీ ప్రస్తుతం ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా పంత్ ఫెయిల్ అవుతున్నాడు.

(4 / 5)

(x/Rishabhian_17)

టీమిండియాలో మరో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. కానీ అతనికి అవకాశాలు చాలా తక్కువే. నిలకడలేని ఫామ్ తో రాహుల్ టీమ్ లోకి వస్తూ వెళ్తున్నాడు. గతంలో టెస్టులో భారత్ కు కెప్టెన్ గా చేసిన అనుభవం అతనికి ఉంది.

(5 / 5)

(x/CrickitbyHT)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు