(1 / 8)
ఐపీఎల్ 2025 టోర్నీలో లక్నో సూపర్ జెయింట్స్‌తో వైజాగ్ వేదికగా సోమవారం (మార్చి 24) జరిగిన మ్యాచ్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. ఢిల్లీ ఆటగాడు అశుతోష్ శర్మ 31 బంతుల్లోనే అజేయంగా 66 పరుగులతో అద్భుత హిట్టింగ్ చేసి గెలిపించాడు. అయితే, థ్రిల్లింగ్ గెలుపులో విప్రాజ్ నిగమ్‍ది కూడా ముఖ్యమైన పాత్రే.
(PTI)(2 / 8)
210 పరుగులు ఛేజింగ్‍లో ఢిల్లీ 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‍కు దిగిన ఆల్‍రౌండర్ విప్రాజ్ ధనాధన్ హిట్టింగ్‍తో చెలరేగాడు. 15 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో దుమ్మురేపాడు. ఓటమి తప్పదనుకున్న దశలో ఢిల్లీకి ఆశలు రేపాడు. అశుతోష్ ఆ తర్వాత అదగొట్టి ఢిల్లీని గెలుపు తీరం దాటించాడు.
(AFP)(3 / 8)
విప్రాజ్ బౌలింగ్‍లోనూ ఓ వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత సూపర్ హిట్టింగ్‍తో దుమ్మురేపాడు. దీంతో అతడెవరు అని చాలా మంది వెతికేస్తున్నారు.
(Surjeet Yadav)(4 / 8)
విప్రాజ్ నిగమ్.. ఉత్తర ప్రదేశ్‍కు చెందిన ఆటగాడు. యూపీటీ20 2024 సీజన్‍లో యూపీ ఫాల్కన్స్ తరఫున 12 మ్యాచ్‍లు ఆడిన ఈ స్పిన్నర్ 20 వికెట్లు పడగొట్టాడు.
(PTI)(5 / 8)
ఉత్తర ప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్లో గతేడాది అన్ని ఫార్మాట్లలో విప్రాజ్ అరంగేట్రం చేశాడు. 2024-25 సీజన్‍లో మూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‍లు, ఐదు లిస్ట్-ఏ మ్యాచ్‍లు, ఏడు టీ20ల్లో ఈ ఆల్‍రౌండర్ ఆడాడు.
(AFP)(6 / 8)
2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 ఎకానమీతో 8 వికెట్లు సాధించాడు విప్రాజ్ నిగమ్. ఆంధ్రా జట్టుతో జరిగిన మ్యాచ్‍లో 8 బంతుల్లోనే 27 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. రంజీ ట్రోఫీలో మూడు మ్యాచ్‍ల్లోనే 13 వికెట్లు పడగొట్టాడు.
(AFP)(7 / 8)
ఐపీఎల్ 2025 సీజన్ కోసం జరిగిన వేలంలో విప్రాజ్ నిగమ్‍ను రూ.50లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సొంతం చేసుకుంది. ఐపీఎల్‍లో తొలి మ్యాచ్‍లోనే విప్రాజ్ సత్తాచాటాడు.
(PTI)ఇతర గ్యాలరీలు