Maha kumbh mela 2025: మహాకుంభమేళాలో సోషల్ మీడియా సెన్సేషన్ బ్యూటీ.. ఇంతకీ ఎవరీమె?-who is this beauty who became a social media sensation in maha kumbh mela 2025 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Maha Kumbh Mela 2025: మహాకుంభమేళాలో సోషల్ మీడియా సెన్సేషన్ బ్యూటీ.. ఇంతకీ ఎవరీమె?

Maha kumbh mela 2025: మహాకుంభమేళాలో సోషల్ మీడియా సెన్సేషన్ బ్యూటీ.. ఇంతకీ ఎవరీమె?

Jan 14, 2025, 08:45 PM IST Sudarshan V
Jan 14, 2025, 08:45 PM , IST

Maha kumbh mela 2025: మహాకుంభమేళాలో అత్యంత అందమైన సాధ్వి పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హర్ష రిచాలియా. ఈ రోజు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా సాధువులతో కలిసి త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. నిరంజని అఖాడా ఊరేగింపులో ఆమె సంగమానికి చేరుకున్నారు.

మహాకుంభ మేళాలో అందమైన సాధ్వి గా హర్ష రిచాలియా వైరల్ అయ్యారు. నిరంజనీ అఖాడాకు చెందిన సాధువులతో కలిసి ఆమె మంగళవారం రథంలో సంగం ఘాట్ కు వెళ్లి, అమృత స్నానం ఆచరించారు. ఈ వివరాలతో ఒక వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

(1 / 8)

మంగళవారం వేకువజామున నిరంజని అఖాడా శిబిరంలో షాహీస్నానం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలు ఆచారాలను పాటించారు. ఈ పూజా కార్యక్రమంలో సాధువులతో పాటు హర్ష కూడా పాల్గొన్నారు.

(2 / 8)

హర్ష నిరంజని అఖాడా సాధువులతో కలిసి రాజస్నానానికి బయలుదేరినప్పుడు సూర్యోదయం కూడా కాలేదు. తీవ్రమైన చలిలో, కాషాయ శాలువా ధరించి షాహీ స్నాన్ కు వెళ్లారు. నిరంజని అఖాడా శిబిరం నుండి బయలుదేరిన తరువాత, ఆమె రథం చేరే వరకు ఆమె చేతులు జోడించే ఉన్నారు. ఆ మార్గలో ఆమె ఫోటోలు తీయడానికి జనం ఎగబడ్డారు.

(3 / 8)

రథం దిగి సంగం వెళ్లే దారిలో ఆమె చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్లారు. ఆ దారిలో ఆమెతో మాట్లాడేందుకు, ఫొటోలు దిగేందుకు జనం గుమిగూడారు. పలువురు ఆమెతో సెల్ఫీలు దిగారు. మీడియా కూడా ఆమెపై ఫోకస్ పెట్టింది.

(4 / 8)

సంగం తీరానికి చేరుకున్న హర్ష సాధువులు, వాలంటీర్ల గుంపులో స్నానమాచరించారు. హర్ష రిచాలియా శనివారం మీడియాతో మాట్లాడుతూ .. తనను అందమైన సాధ్వి అనడం సంతోషంగానే ఉన్నప్పటికీ.. తాను ఇంకా సాధ్విని కాలేదని చెప్పింది.

(5 / 8)

అయితే, తాను సాధ్విని అయ్యానని  రెండేళ్ల క్రితమే హర్ష తెలిపింది. అయితే రెండు నెలల క్రితం వరకు ఆమె యాంకరింగ్ చేస్తున్న కొన్ని ఫోటోలు తన ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ఉన్నాయి.

(6 / 8)

హర్షకు ఇన్ స్టాగ్రామ్ లో పది లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు , వీరిలో దాదాపు సగం మంది గత మూడు రోజుల్లో యాడ్ అయినవారే. ఆమె మహాకుంభ్ కు వచ్చిన తరువాత మరింత వైరల్ అవుతున్నారు.

(7 / 8)

కైలాసగిరితో కలిసి ఉన్న నిరంజని అఖాడా ఫొటోను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో ఖాతాలో పోస్ట్ చేశారు.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు