(1 / 5)
సోమవారం (ఏప్రిల్ 14) లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో సీఎస్కే ఓపెనర్ గా బరిలో దిగిన 20 ఏళ్ల షేక్ రషీద్ ఆకట్టుకున్నాడు. తక్కువ బంతులే ఆడినప్పటికీ తనదైన ముద్ర వేశాడు.
(AFP)(2 / 5)
19 బంతుల్లో 27 పరుగులు చేశాడు రషీద్. 6 ఫోర్లు కొట్టాడు. 142 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు. కవర్డ డ్రైవ్, స్ట్రెయిట్ డ్రైవ్, పికప్ షాట్ తో ఆకాశ్ దీప్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టాడు.
(AP)(3 / 5)
అవేశ్ ఖాన్ వేసిన స్లో డెలివరీకి వికెట్ కోల్పోయిన రషీద్.. రచిన్ తో కలిసి ఫస్ట్ వికెట్ కు 52 రన్స్ జోడించి సీఎస్కే గెలుపుకు బాటలు వేశాడు.
(AFP)(4 / 5)
గుంటూరుకు చెందిన షేక్ రషీద్ 2022 అండర్-19 ప్రపంచకప్ లో మెరుపులతో వెలుగులోకి వచ్చాడు. ఇండియా కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఆంధ్ర తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సత్తాచాటుతున్నాడు. 19 మ్యాచ్ ల్లో 1204 పరుగులు చేశాడు.
(PTI)ఇతర గ్యాలరీలు