(1 / 5)
గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ యంగ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ లో అతనికిదే తొలి మ్యాచ్. అయినా ఎలాంటి బెరుకు లేకుండా ఆరంభం నుంచే భారీ షాట్లు ఆడాడు. 23 బాల్స్ లోనే 47 రన్స్ కొట్టాడు. ఇందులో 7 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి.
(REUTERS)(2 / 5)
ఐపీఎల్ అరంగేట్రంలోనే 24 ఏళ్ల ప్రియాన్ష్ ఆర్య అదరగొట్టాడు. సిరాజ్ లాంటి సీనియర్ పేసర్ బౌలింగ్ లో చెలరేగాడు. ఢిల్లీకి చెందిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుటుంబం నుంచి వచ్చిన ప్రియాన్ష్.. ద్రోణాచార్య అవార్డీ సంజయ్ భరద్వాజ్ అకాడమీలో రాటుదేలాడు.
(AFP)(3 / 5)
ఈ బిగ్ హిట్టింగ్ ఓపెనర్ గతేడాది ఢిల్లీ ప్రిమియర్ లీగ్ లో సంచలనం రేపాడు. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ తరపున ఆడిన ప్రియాన్ష్.. నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ తో మ్యాచ్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్ లో అతను 50 బాల్స్ లోనే 120 రన్స్ చేశాడు. టీ20ల్లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా యువరాజ్, పొలార్డ్ సరసన ప్రియాన్ష్ చేరాడు.
(REUTERS)(4 / 5)
ఢిల్లీ ప్రిమియర్ లీగ్ లో సన్సేషనల్ ఇన్నింగ్స్ తో ప్రియాన్ష్ పేరు మార్మోగింది. గతేడాది నవంబర్ లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ.3.8 కోట్లకు ప్రియాన్ష్ ను కొనుగోలు చేసింది.
(AP)(5 / 5)
నిజానికి యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్ తో కలిసి 2020 అండర్-19 ప్రపంచకప్ లో ప్రియాన్ష్ ఆడాల్సింది. కానీ అండర్-16లో ఏజ్ టెస్ట్ లో పాల్గొనకపోవడంతో అండర్-19 క్రికెట్ ను రెండేళ్లు మాత్రమే ఆడేలా అతనికి కండీషన్ విధించారు. ఆ అండర్-19 ప్రపంచకప్ కంటే ముందే ఈ గడువు తీరిపోయింది. ప్రియాన్ష్ గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 222 పరుగులు చేశాడు. ఐపీఎల్ వేలానికి ఒక రోజు ముందే ఉత్తరప్రదేశ్ పై 43 బాల్స్ లోనే 102 రన్స్ కొట్టాడు.
(AFP)ఇతర గ్యాలరీలు