
(1 / 5)
ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్ రేసులో హ్యారీ బ్రూక్ ముందు వరుసలో ఉన్నాడు. బట్లర్ స్థానాన్ని అతను రీప్లేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరు నెలల క్రితం బ్రూక్ కెప్టెన్సీలోని ఇంగ్లండ్.. ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 3-2తో ఓడించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుకు అతనే వైస్ కెప్టెన్.
(AFP)(2 / 5)
ఫిల్ సాల్ట్ కూడా ఇంగ్లండ్ కెప్టెన్ గా పరిగణించాల్సిన ఆటగాడే. గాయంతో బట్లర్ లేనప్పుడు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో జట్టును సాల్ట్ నడిపించాడు. ఆ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ సిరీస్ లో సాల్ట్ తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు.
(REUTERS)(3 / 5)
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లివింగ్ స్టన్ కూడా సారథ్యానికి ప్రధాన పోటీదారే. గతంలో జట్టును నడిపించిన అనుభవం అతనికి ఉంది. 2024 చివర్లో వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో ఇంగ్లండ్ కు లివింగ్ స్టన్ కెప్టెన్. ఒత్తిడిని ఎదుర్కొనే తీరు, దూకుడైన ఆటతీరు లివింగ్ స్టన్ కు కలిసొచ్చే ఛాన్స్ ఉంది.
(REUTERS)
(4 / 5)
ఆల్ రౌండ్ సామర్థ్యంతో ఇంగ్లండ్ జట్టులో ప్రధాన ఆల్ రౌండర్ గా ఎదిగాడు సామ్ కరన్. 2022 టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఆ తర్వాత ఫామ్ లేమితో జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు, కౌంటీల్లో సర్రేకు కెప్టెన్ గా పనిచేసిన అనుభవం కరన్ కు ఉంది.
(x/CurranSM)
(5 / 5)
బ్యాటింగ్ లో అదరగొడుతున్న ఓపెనర్ డకెట్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై రికార్డు సెంచరీ బాదాడు. కానీ నోటి దురుసు డకెట్ కు ఇబ్బందిగా మారే అవకాశముంది. భారత్ తో వార్మప్ వన్డే సిరీస్ కాదు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తామని డకెట్ గతంలో పేర్కొన్నాడు.
(AP)ఇతర గ్యాలరీలు