(1 / 5)
ఒక్క సీజన్ తోనే వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి లైఫ్ టర్న్ అయింది. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఈ కుర్రాడు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 303 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. నితీశ్ ను రూ.6 కోట్లకు హైదరాబాద్ రిటైన్ చేసుకుంది.
(x/SunRisers)(2 / 5)
సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ తొమ్మిదో సారి ఐపీఎల్ లో ఆడబోతున్నాడు. 2017లో సన్ రైజర్స్ కు ఆడిన సిరాజ్.. 2018 నుంచి 2024 వరకు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్ కు ముందు వేలంలో గుజరాత్ టైటాన్స్ అతణ్ని రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది. 93 మ్యాచ్ ల్లో సిరాజ్ 93 వికెట్లు పడగొట్టాడు.
(x/mdsirajofficial)(3 / 5)
హైదరాబాదీ స్టైలిష్ బ్యాటర్ తిలక్ వర్మ ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కు కీ ప్లేయర్ గా మారాడు. ఈ సీజన్ కోసం అతణ్ని ముంబయి రూ.8 కోట్లకు రిటైన్ చేసుకుంది. 38 ఐపీఎల్ మ్యాచ్ ల్లో తిలక్ 1156 పరుగులు చేశాడు.
(x/mipaltan)(4 / 5)
గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్లాడు. వేలంలో అతణ్ని రూ.30 లక్షలకు టీమ్ తీసుకుంది. గత సీజన్ లోనూ సీఎస్కేతో ఉన్న రషీద్ కు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అండర్-19 వరల్డ్ కప్ లో సత్తాచాటిన రషీద్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆంధ్ర తరపున 33 ఇన్నింగ్స్ ల్లో 1204 పరుగులు చేశాడు.
(x/skrasheed66)(5 / 5)
ఆంధ్ర స్పిన్నర్ త్రిపురణ విజయ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.30 లక్షలకు దక్కించుకుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో విజయ్ 9 మ్యాచ్ ల్లో 28 వికెట్లు పడగొట్టాడు. ఆంధ్ర కుర్రాళ్లు పైలా అవినాష్ (రూ.30 లక్షలకు పంజాబ్ కింగ్స్), సత్యనారాయణ రాజు (రూ.30 లక్షలకు ముంబయి ఇండియన్స్) కూడా ఐపీఎల్ లో పాల్గొంటున్నారు.
(x/DelhiCapitals)ఇతర గ్యాలరీలు