Cricketers Turned Actors: యాక్టర్లుగా మారిన క్రికెటర్లు.. కపిల్ దేవ్ నుంచి వార్నర్ వరకు..ఈ లిస్ట్ చూస్తే షాక్ అవాల్సిందే-who are the cricketers turned actors acted in movies from kapil dev to david warner ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cricketers Turned Actors: యాక్టర్లుగా మారిన క్రికెటర్లు.. కపిల్ దేవ్ నుంచి వార్నర్ వరకు..ఈ లిస్ట్ చూస్తే షాక్ అవాల్సిందే

Cricketers Turned Actors: యాక్టర్లుగా మారిన క్రికెటర్లు.. కపిల్ దేవ్ నుంచి వార్నర్ వరకు..ఈ లిస్ట్ చూస్తే షాక్ అవాల్సిందే

Published Mar 15, 2025 04:43 PM IST Chandu Shanigarapu
Published Mar 15, 2025 04:43 PM IST

  • Cricketers Turned Actors: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ యాక్టర్ గా మారాడు.  తెలుగు సినిమా ‘రాబిన్ హుడ్’లో స్పెషల్ క్యామియో చేశాడు. కపిల్ దేవ్ నుంచి వార్నర్ వరకూ చాలా మంది ఆటగాళ్లు సినిమాల్లో అడుగుపెట్టారు. కొంతమంది క్రికెట్ స్టార్లూ యాక్టింగ్ తో ఇరగ్గొట్టారు. ఈ లిస్ట్ మీ కోసం.  

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ నటనలోనూ ఓ చేయి వేశాడు. యాక్టింగ్ తో అలరించాడు. 1980 లో మరాఠి ఫిల్మ్ ‘సావ్లి ప్రేమాచి’తో సన్నీ యాక్టింగ్ డెబ్యూ చేశాడు. నసీరుద్దీన్ షాతో కలిసి మలమాల్ లో ఓ క్యామియో ప్లే చేశాడు. 

(1 / 6)

(x/hi__hassan)

క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత యాక్టర్ గా అజయ్ జడేజా రెండో ఇన్నింగ్స్ మొదలెట్టాడు. 2003లో ఈ మాజీ కెప్టెన్ ఆటకు వీడ్కోలు పలికాడు. ‘ఖేల్’ మూవీతో ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ చేసిన అజయ్.. పల్ పల్ దిల్ కే సాత్ మూవీలోనూ యాక్ట్ చేశాడు. 

(2 / 6)

(x/saintkishore)

వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్ కూడా సినిమాల్లో లక్ ట్రై చేసి చూశాడు. ఐపీఎల్ ఫిక్సింగ్ తో నిషేధం ఎదుర్కొని, ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన ఈ మాజీ పేసర్ అయిదు సినిమాల్లో నటించాడు. హిందీలో అక్సర్ 2 చేశాడు. మళయాళంలో కాతువాకులా రెండు కాదల్ మూవీలో నటించాడు. 

(3 / 6)

(x/vigil_in)

ఇండియాకు మొట్టమొదటి వరల్డ్ కప్ అందించిన లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా సినిమాల్లో నటించాడు. క్యామియో రోల్స్ ప్లే చేశాడు. ‘83’, ‘ముజ్ సే షాది కరోగి’ తదితర సినిమాల్లో తళుక్కుమని మెరిశాడు. 

(4 / 6)

(x/therealkapildev)

టీమిండియా మాజీ డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా మూవీలో యాక్ట్ చేశాడన్న సంగతి చాలా మందికి తెలియదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పంజాబీ ఫిల్మ్ లో నటించాడు. 2008లో వచ్చిన యానిమేటెడ్ ఫిల్మ్ ‘జంబో’లో ఓ క్యారక్టర్ కు వాయిస్ ఇచ్చాడు. యువీ తండ్రి యోగ్ రాజ్ సింగ్ ఒకప్పుడు పెద్ద యాక్టర్. 30కి పైగా పంజాబీ సినిమాల్లో, 10 హిందీ మూవీస్ లో అతను యాక్ట్ చేశాడు. టీమిండియాకు ఓ టెస్టు, 6 వన్డేలు ఆడాడు. 

(5 / 6)

(x/YUVSTRONG12)

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ గ్రౌండ్ లోనే కాదు సిల్వర్ స్క్రీన్ మీదా అదరగొట్టాడు. విక్రమ్ హీరోగా నటించిన ‘కోబ్రా’ మూవీలో ఇర్ఫాన్ యాక్టింగ్ తో అదుర్స్ అనిపించాడు. ఈ మూవీలో ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఇక బ్రెట్ లీ, డ్వేన్ బ్రావో, మోసిన్ ఖాన్ లాంటి ఫారెన్ క్రికెటర్లు కూడా యాక్టింగ్ ట్రై చేసిన వాళ్లే. 

(6 / 6)

(x/IrfanPathan)

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు.

ఇతర గ్యాలరీలు