Sai Pallavi: హీరోయిన్ కాకముందు సాయిపల్లవి నటించిన సినిమాలు ఏవో తెలుసా?
Sai Pallavi: తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది సాయిపల్లవి. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో తండేల్ మూవీ చేస్తోంది. తమిళంలో శివకార్తికేయన్‌తో బయోపిక్‌లో నటిస్తోంది.
(1 / 6)
హీరోయిన్ కాకముందు సాయిపల్లవి పలు తమిళ సినిమాల్లో చిన్న రోల్స్ చేసింది సాయిపల్లవి. అప్పట్లో సాయిపల్లవికి పాపులారిటీ లేకపోవడంతో ఎవరూ ఆమెను గుర్తించలేకపోయారు
(2 / 6)
విశాల్ హీరోగా నటించిన పందెం కోడి మూవీలో మీరా జాస్మిన్ స్నేహితురాలిగా సాయిపల్లవి నటించింది. థియేటర్ సీన్‌లో మీరా జాస్మిన్ తన స్నేహితులతో కలిసి స్టెప్పులు వేస్తుంది. ఆ సీన్‌లో మీరా జాస్మిన్ ఫ్రెండ్స్‌లో ఒకరిగా సాయిపల్లవి కనిపిస్తుంది.
(3 / 6)
మలయాళ మూవీ ప్రేమ్‌మ్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సాయిపల్లవి. ఇందులో మలర్ పాత్రలో సాయిపల్లవి యాక్టింగ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు.
(4 / 6)
తెలుగులో ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్‌సింగరాయ్‌తో పాటు పలు సినిమాల్లో అసమాన నటనతో ఆకట్టుకున్నది సాయిపల్లవి. అందం కంటే యాక్టింగ్‌తోనే ఫ్యాన్స్ మనసుల్ని దోచేసింది.
(5 / 6)
తండేల్‌తో ఏడాది గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది సాయిపల్లవి. లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇతర గ్యాలరీలు