Price Hike in 2025: కొత్త సంవత్సరంలో సామాన్యుడికి ఝలక్!ఈ వస్తువుల ధరల్లో ఊహించని మార్పులు
Price Hike in 2025: కొత్త ఏడాది కొత్త మార్పులు తీసుకొస్తుందని అందరం ఆశిస్తాం. దానికి తగ్గట్టుగానే వాణిజ్యపరంగా పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. కార్ల నుంచి సబ్బులు, బిస్కెట్ల వరకూ వస్తువుల ధరలు పెరుగుతుండగా, మరికొన్ని ఉత్పత్తుల ధరలు తగ్గిపోనున్నాయి. .
(1 / 8)
జనవరి 1 నుంచి వినియోగ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. 2024 సంవత్సరం ఎఫ్ఎంసీజీ పరిశ్రమకు కాస్త సవాలుగా మారింది. ముఖ్యంగా ముడి సరుకుల ధరలు పెరగడంతో కంపెనీలు రేట్లు పెంచక తప్పే పరిస్థితి కనపడటం లేదు. ఇప్పటికే పామాయిల్, కాఫీ, కోకో వంటి వివిధ వస్తువుల ధరలు పెరిగాయి. 2025 జనవరి 1 నుంచి మరిన్ని వినియోగ వస్తువుల ధరలు పెరగనున్నాయి
(2 / 8)
జనవరి 1 నుండి అనేక కంపెనీలు తమ కార్ల ధరలను పెంచే అవకాశం ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే తన ఎస్‌యూవీలు, వాణిజ్య వాహనాల ధరలను 3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. హ్యుందాయ్, మారుతి సుజుకి కూడా ధరల పెంపును ప్రకటించాయి. కియా, జెఎస్ డబ్ల్యు, ఎంజి మోటార్ కూడా ధరల పెంపును ప్రకటించాయి.
(Getty Images via AFP)(3 / 8)
జనవరి 1 నుంచి ఏటిఎంల నుండి నగదు ఉపసంహరణకు బ్యాంకులు అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. బ్యాంకులు, ఏటిఎం ఆపరేటర్ల నుంచి ఇప్పటికే దీని గురించి ప్రతిపాదనలు వెళ్లాయట. దీని గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మీ బ్యాంకును సంప్రదించండి.
(4 / 8)
జనవరి 1 నుంచి మొబైల్ రీఛార్జ్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ట్రాయ్ ఆదేశాలతో కొన్ని పథకాల ధరలు తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో ఇంటర్నెట్ లేని టర్మ్ ప్లాన్లను ప్రవేశపెట్టాలని ట్రాయ్ నుంచి టెలికాం ఆపరేటర్లు ఆదేశాలు అందుకున్నారు. ఇదొక రకంగా శుభ సూచికమే.
(5 / 8)
పార్లే-జి బిస్కెట్ల ధరలు పెంపు: జనవరి 1 నుంచి పార్లే-జి బిస్కెట్ల ధరలు పెరగనున్నాయి. ప్రొడక్షనల్ కాస్ట్ పెరుగుతుండటంతో ధరలు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం నేరుగా వినియోగదారులపై కనిపించనుంది.
(6 / 8)
పెట్రోల్, డీజిల్ ధరలు: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో మార్పుల సంకేతాల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.
(7 / 8)
సబ్బు ధరల పెంపు: ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల సబ్బుల ధర 7 నుంచి 8 శాతం పెరుగుతుంది. ఇది మధ్యతరగతి ప్రజలపై పెనుభారం కానుంది.
ఇతర గ్యాలరీలు