Dry Fruits: ఏ డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తినాలి? వేటిని నేరుగా తినాలి?
Dry Fruits: డ్రై ఫ్రూట్స్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ లో కొన్ని నానబెట్టి తినాలి, మరికొన్ని నేరుగా తినేయచ్చు. కానీ ఏవి నానబెట్టి తినాలో, ఏవి నేరుగా తినాలో ఎంతో మందికి తెలియదు.
(1 / 8)
ఇంట్లో పెద్దవాళ్లు డ్రైఫ్రూట్స్ ను నానబెట్టి తినమని చెబుతారు. అయితే అన్నింటినీ నానబెట్టకూడదు. కొన్ని రకాల డ్రైఫ్రూట్స్ నీటిలో నానబెట్టడం వల్ల అందులో ఉండే పోషకాలు నీటిలో కరిగిపోయే అవకాశం ఉంది. ఏ డ్రై ఫ్రూట్స్ నానబెట్టాలో, ఏవి నానబెట్టకూడదో తెలుసుకోండి. (shutterstock)
(2 / 8)
డ్రై ఫ్రూట్స్ లో మనకు శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, ఫోలేట్, ఐరన్, విటమిన్ బి12, విటమిన్ డి, విటమిన్ ఇ వంటి పోషకాలు ఉంటాయి. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా నిండుగా ఉంటాయి. (shutterstock)
(3 / 8)
బాదం పప్పును నానబెట్టాకే తినాలి. వీటివలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బాదం తొక్కల్లో టానిన్లు ఉంటాయి. ఇవి శరీరంలో జీర్ణ సమస్యలకు కారణం అవుతాయి. కాబట్టి బాదం నానబెట్టి తొక్క తీసి తినాలి. (shutterstock)
(4 / 8)
బాదంపప్పు లాగే వాల్ నట్స్ కూడా నానబెట్టి తినాలి. ఇందులో అనేక రకాల ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహకరిస్తాయి. వీటిని పాలల్లో లేదా నీటిలో నానబెట్టాలి.(shutterstock)
(5 / 8)
అంజీర్ పండ్లకు వేడి చేసే స్వభావం ఉంది. అందుకే వాటిని నేరుగా తినకూడదు. నానబెట్టాకే తినాలి. (shutterstock)
(6 / 8)
ఎండుద్రాక్షలను మాత్రం నానబెట్టకూడదు. నానబెడితే వాటిలోని పోషకాలు పోతాయి. కాబట్టి వాటిని నేరుగానే తినాలి. (shutterstock)
(7 / 8)
అవిసె గింజల్లో ఒమేగా-3 కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మెదడు, పేగు ఆరోగ్యంపై ఇవి సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. అవిసె గింజలను నానబెట్టి తినడానికి బదులుగా, వాటిని పొడిగా వేయించి తినాలి.(shutterstock)
ఇతర గ్యాలరీలు