(1 / 8)
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాది రూ.6 వేలు చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే 19వ విడత నిధులను జమ చేసిన సంగతి తెలిసిందే. ప్రతి రైతు ఖాతాలో రూ. 2 వేలను జమ చేసింది.
(2 / 8)
రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఈ డబ్బులు అందిస్తుంది. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ విధానంలో డబ్బులు జమ అవుతాయి. ఇప్పటి వరకు 19 విడతల్లో పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో వేశారు. అయితే 20వ విడత నిధులను కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
(3 / 8)
వచ్చే జూన్ నెలలోనే పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనుంది. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఈ డబ్బులను కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది. అన్ని కుదిరితే జూన్ మొదటి వారం లేదా జూన్ 15వ తేదీలోపు జమ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
(4 / 8)
ఇక రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి. పీఎం కిసాన్ వెబ్ సైట్ లో రైతులు స్వయంగా ఈ-కేవైసీ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి కాని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావు. ఇక అర్హుల జాబితా వివరాలను https://pmkisan.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
(5 / 8)
https://pmkisan.gov.in/aadharekyc.aspx లింక్ పై క్లిక్ చేసి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు https://pmkisan.gov.in/RegistrationFormupdated.aspx లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవచ్చు. అధికారుల పరిశీలన పూర్తయితేనే అఫ్రూవ్ వస్తుంది.
(6 / 8)
పీఎం కిసాన్ నిధులు జమ అయితే లబ్ధిదారులు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx లింక్ పై క్లిక్ చేసి డబ్బులు జమ వివరాలను సింపుల్ గా తెలుసుకోవచ్చు. 1వ విడుత నుంచి 20వ విడుత వరకు కూడా డేటా అందుబాటులో ఉంటుంది.
(7 / 8)
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని 2019లో ప్రధాని మోదీ ప్రారంభించారు. చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి సాయంగా ఏటా రూ.6000 మూడు వాయిదాల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తు్న్నారు. నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలోనే ఈ డబ్బులను జమ చేస్తారు.
(8 / 8)
పీఎం కిసాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకి ప్రతి నాలుగు నెలలకి ఒకసారి నిధులను జమ చేస్తుంది. మొత్తం మూడు విడతల్లో రూ. 2,000 చొప్పున సంవత్సరానికి రూ. 6000 లని ఎలాంటి మధ్యవర్తులు లేకుండానే రైతుల బ్యాంకు అకౌంట్ లోకి బదిలీ చేస్తుంది.
ఇతర గ్యాలరీలు