Virat Kohli: అనుష్క శర్మ కంటే ముందు ఆ హీరోయిన్‌తో విరాట్ రొమాన్స్, కోహ్లీ పెళ్లి అయ్యే వరకూ ముద్దుగుమ్మ గప్‌చుప్!-when tamannaah bhatia spoke about virat kohli dating rumours ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Virat Kohli: అనుష్క శర్మ కంటే ముందు ఆ హీరోయిన్‌తో విరాట్ రొమాన్స్, కోహ్లీ పెళ్లి అయ్యే వరకూ ముద్దుగుమ్మ గప్‌చుప్!

Virat Kohli: అనుష్క శర్మ కంటే ముందు ఆ హీరోయిన్‌తో విరాట్ రొమాన్స్, కోహ్లీ పెళ్లి అయ్యే వరకూ ముద్దుగుమ్మ గప్‌చుప్!

Nov 05, 2024, 07:45 PM IST Galeti Rajendra
Nov 05, 2024, 07:45 PM , IST

Virat Kohli Dating Rumours: అనుష్క శర్మతో నాలుగేళ్లు డేటింగ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. 2017లో వివాహం చేసుకున్నాడు. కానీ.. అంతకంటే ఐదేళ్ల ముందు కోహ్లీ ఒక సౌత్ హీరోయిన్‌తో డేటింగ్ చేసినట్లు రూమర్స్ వినిపించాయి. కోహ్లీ పెళ్లి అయిన ఏడాది తర్వాత ఆ హీరోయిన్ ఆ రూమర్‌పై స్పందించింది. 

విరాట్ కోహ్లీ ఈరోజు (నవంబరు 5)న తన 36వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. అనుష్క శర్మతో అతని వైవాహిక జీవితం కూడా ఈ నవంబరుతో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. పెళ్లి అయితే..  ఏడేళ్ల క్రితం అయ్యింది.. కానీ  వీరిద్దరి మధ్య బంధం 11 ఏళ్లుగా కొనసాగుతోంది. 

(1 / 9)

అనుష్క శర్మని తొలిసారి 2013లో ఓ షాంపూ యాడ్‌లో విరాట్‌ కోహ్లీ కలిశాడు. అప్పట్లో తొలిచూపులోనే అనుష్క.. విరాట్ కోహ్లీ నచ్చింది. కానీ.. కోహ్లీ యాటిట్యూడ్‌తో అనుష్క శర్మకి చిరాకు కలిగించిందట. దాంతో విరాట్ కూడా ఆ యాడ్ సమయంలో కొంచెం కంగారుపడినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

(2 / 9)

ఆ యాడ్ షూటింగ్‌లోనే కోహ్లీ, అనుష్క శర్మ మధ్య చిన్న గొడవ కూడా అప్పట్లో జరిగిందట. అనుష్క శర్మని ఎగతాళి చేస్తూ ఇంతకంటే హై హీల్స్ లేవా? అంటూ కోహ్లీ కామెంట్ చేయడం.. అనుష్కకి చాలా కోపం వచ్చిందట.

(3 / 9)

ఆ యాడ్ షూటింగ్‌లోనే కోహ్లీ, అనుష్క శర్మ మధ్య చిన్న గొడవ కూడా అప్పట్లో జరిగిందట. అనుష్క శర్మని ఎగతాళి చేస్తూ ఇంతకంటే హై హీల్స్ లేవా? అంటూ కోహ్లీ కామెంట్ చేయడం.. అనుష్కకి చాలా కోపం వచ్చిందట.

కానీ.. ఆ తర్వాత అనుష్క శర్మ ఎంట్రీతో తమన్నా భాటియా గురించి ఎవరూ మాట్లాడలేదు. అనుష్క శర్మ కూడా తొలుత విరాట్ కోహ్లీపై కోప్పడినా.. ఆ తర్వాత అతని ప్రేమలో పడి దాదాపు నాలుగేళ్లు డేటింగ్ చేసింది. ఎన్నో మ్యాచ్‌లను విరాట్ కోహ్లీ కోసం చూసేందుకు స్టేడియానికి వచ్చింది.  చేసుకున్నారు.  

(4 / 9)

కానీ.. ఆ తర్వాత అనుష్క శర్మ ఎంట్రీతో తమన్నా భాటియా గురించి ఎవరూ మాట్లాడలేదు. అనుష్క శర్మ కూడా తొలుత విరాట్ కోహ్లీపై కోప్పడినా.. ఆ తర్వాత అతని ప్రేమలో పడి దాదాపు నాలుగేళ్లు డేటింగ్ చేసింది. ఎన్నో మ్యాచ్‌లను విరాట్ కోహ్లీ కోసం చూసేందుకు స్టేడియానికి వచ్చింది.  చేసుకున్నారు.  (AFP)

వాస్తవానికి అనుష్క శర్మతో ప్రేమలో పడకుండా హీరోయిన్ తమన్నా భాటియాతో విరాట్ కోహ్లీ డేటింగ్ చేసినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇద్దరూ కలిసి ఒక యాడ్‌లో కూడా నటించారు. 

(5 / 9)

వాస్తవానికి అనుష్క శర్మతో ప్రేమలో పడకుండా హీరోయిన్ తమన్నా భాటియాతో విరాట్ కోహ్లీ డేటింగ్ చేసినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇద్దరూ కలిసి ఒక యాడ్‌లో కూడా నటించారు. 

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పెళ్లి అయిపోయిన తర్వాత తమన్నా భాటియా.. కోహ్లీ‌తో డేటింగ్ రూమర్స్‌పై పెదవి విప్పింది. 2018లో మాట్లాడిన తమన్నా.. 2012లో ఆ యాడ్ షూట్ తర్వాత విరాట్‌ను తానెప్పుడూ కలవలేదని ఒక్క మాటలో తేల్చేసింది. అంతేకాదు.. విరాట్ చాలా మంది నటుల కంటే బాగా ఆ యాడ్‌లో నటించాడాని కితాబు కూడా ఇచ్చింది.

(6 / 9)

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పెళ్లి అయిపోయిన తర్వాత తమన్నా భాటియా.. కోహ్లీ‌తో డేటింగ్ రూమర్స్‌పై పెదవి విప్పింది. 2018లో మాట్లాడిన తమన్నా.. 2012లో ఆ యాడ్ షూట్ తర్వాత విరాట్‌ను తానెప్పుడూ కలవలేదని ఒక్క మాటలో తేల్చేసింది. అంతేకాదు.. విరాట్ చాలా మంది నటుల కంటే బాగా ఆ యాడ్‌లో నటించాడాని కితాబు కూడా ఇచ్చింది.(AFP)

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వివాహమైన మూడేళ్ల తర్వాత.. వారికి ఒక పాప జన్మించింది. ఈ ఏడాది ఆరంభంలో ఒక బాబుకి కూడా అనుష్క శర్మ జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలతో కోహ్లీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. 

(7 / 9)

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వివాహమైన మూడేళ్ల తర్వాత.. వారికి ఒక పాప జన్మించింది. ఈ ఏడాది ఆరంభంలో ఒక బాబుకి కూడా అనుష్క శర్మ జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలతో కోహ్లీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. 

తల్లి అయిన తర్వాత అనుష్క శర్మ సినిమాలకి దూరంగా ఉండిపోయింది. పిల్లలు వామిక, అకాయని జాగ్రత్తగా చూసుకోవడానికి తన కెరీర్‌ను పణంగా పెట్టింది. కోహ్లీ‌పై విమర్శలు గుప్పించే వారిపై సోషల్ మీడియాలో అనుష్క శర్మ చురకలు అంటిస్తుంటుంది. 

(8 / 9)

ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీతో ఎక్కువగా లండన్‌లో ఉంటున్నాడు. భారత్ జట్టు మ్యాచ్‌లు లేని సమయాల్లో లండన్‌కి వెళ్లి అక్కడ కుటుంబంతో సమయం గడుపుతుంటాడు. 

(9 / 9)

ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీతో ఎక్కువగా లండన్‌లో ఉంటున్నాడు. భారత్ జట్టు మ్యాచ్‌లు లేని సమయాల్లో లండన్‌కి వెళ్లి అక్కడ కుటుంబంతో సమయం గడుపుతుంటాడు. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు