(1 / 8)
ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు రాబోతున్నాయి. ఇవాళ(మే 13) దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది.
(2 / 8)
అండమాన్ సముద్రమే కాకుండా దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ విడుదల చేసిన బులెటిన్ ద్వారా పేర్కొంది.
(istockphoto.com)(3 / 8)
దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు నికోబార్ దీవులు,అండమాన్ సముద్రం, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ వివరించింది. ఇవి మరింతగా ముందుకు సాగేందుకు తదుపరి 4- 5 రోజులు వాతావరణం మరింత అనుకూలంగా మారే అవకాశం ఉంటుందని అంచనా వేసింది.
(4 / 8)
ఇవాళ దక్షిణ అండమాన్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్న నేపథ్యంలో…ఈ నెల 27 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. కేరళను తాకిన తర్వాత… క్రమంగా దేశవ్యాప్తంగానూ రుతుపవనాలు విస్తరిస్తాయి.
(Unsplash)(5 / 8)
ఇక తెలంగాణలోకి కూడా రుతుపవనాలు ముందుగానే ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. జూన్ మొదటివారంలోపు రాష్ట్రంలోకి రుతుపవనాలు రావొచ్చని భావిస్తోంది. వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలంగా ఉంటే జూన్ 5వ తేదీ నాటికే రాష్ట్ర సరిహద్దులను తాకే అవకాశం ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది.
(Pexels)
(7 / 8)
ఇక ఈ ఏడాది రుతుపవన కాలంలో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ కొద్దిరోజుల కిందటే వెల్లడించింది. ఐఎండీ అంచనాల మేరకు… విస్తారంగా వర్షాలు కురిస్తే…. వ్యవసాయానికి ఢోకా ఉండదు.
(8 / 8)
మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రాన్ని అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో మే 14వ తేదీన (బుధవారం) ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు