(1 / 6)
అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయని వెల్లడించింది. ఈ నెల 27న కేరళకు వస్తాయని ఐఎండీ ప్రకటించింది. 13వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవులలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది.
(unsplash)(2 / 6)
గత 20 ఏళ్లలో 2015లో మినహా 2005-2024 మధ్య కేరళకు నైరుతి రుతుపవనాల ఆగమనానికి సంబంధించి ఐఎండీ అంచనాలు ఎప్పుడూ తప్పలేదు. తాజా అంచనా ప్రకారం.. నైరుతి రుతుపవనాలు పురోగమిస్తున్నందున ప్రస్తుత వేసవి ఎండలు, వడగాడ్పుల నుంచి ప్రజలకు త్వరలో ఉపశమనం లభించనున్నది.
(unsplash)(3 / 6)
సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచి వారం రోజుల వ్యవధిలో కేరళను తాకుతాయి. ఆ తర్వాత వారం, పది రోజుల్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాకు విస్తరిస్తాయి. రుతుపవనాలు కేరళను తాకినప్పటి నుంచి ఏపీలో వాతావరణం మారుతుంది. జూన్ మూడో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తాయి. ఈ ఏడాది నాలుగు రోజులు ముందే రుతుపవనాలు రానున్నందున.. వచ్చే నెల రెండో వారం నుంచే వర్షాలు పుంజుకునే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు.
(unsplash)(4 / 6)
పసిఫిక్ మహాసముద్రంలో లానినా దశ ముగిసి.. ప్రస్తుతం తటస్థ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పసిఫిక్‌లో ఉపరితల ఉష్ణోగ్రతలు అనుకూలంగా మారడంతో నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించేందుకు అనువైన వాతావరణం నెలకొందని నిపుణులు చెబుతున్నారు.
(unsplash)(5 / 6)
మే 20వ తేదీ తరువాత దక్షిణ అండమాన్ సముద్రానికి రుతుపవనాలు తాకాల్సి ఉండగా.. ఈసారి వారం ముందుగా 13వ తేదీన ప్రవేశించనున్నాయి. తరువాత నాలుగైదు రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, దక్షిణ, మధ్య బంగాళాఖాతం, అండమాన్‌లో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని ఐఎండీ తెలిపింది.
(unsplash)(6 / 6)
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో.. సాధారణం కంటే ఎక్కువ.. అంటే 104 శాతం వర్షాపాతం నమోదవుతుందని గత నెలలోనే వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రైతులు భరోసాగా ఉన్నారు. ఈసారి ఏపీలో అన్నదాతలకు అనుకూలంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(unsplash)ఇతర గ్యాలరీలు