(1 / 6)
పిల్లల వయస్సు, బరువు, శారీరక శ్రమను బట్టి నీటి అవసరం మారుతుంది. సాధారణంగా, 1-3 సంవత్సరాల పిల్లలు రోజుకు 4 కప్పుల నీరు తాగాలి. 4-8 సంవత్సరాల పిల్లలు రోజుకు 5 కప్పుల నీరు తాగాలి. 9-13 సంవత్సరాల పిల్లలు రోజుకు 7-8 కప్పుల నీరు తాగాలి.
(unsplash)(2 / 6)
పిల్లలు ఆడుతున్నప్పుడు లేదా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు ఎక్కువ నీరు తాగాలి. ఎండాకాలంలో, పిల్లలకు దాహం వేసినప్పుడు వెంటనే నీరు ఇవ్వాలి. నీరు, పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలను కూడా ఇవ్వవచ్చు.
(unsplash)(3 / 6)
తక్కువ నీరు తాగడం వల్ల పిల్లలలో అలసట, తలనొప్పి, మైకం, మలబద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది. వేడి దెబ్బ తగులుతుంది. ఇది తీవ్రమైన సందర్భాల్లో ప్రాణాంతకం కూడా కావచ్చు.
(unsplash)(4 / 6)
పిల్లలు సరిగా నీరు తాగకపోతే.. మూత్రపిండాల సమస్యలు వస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయవు. నీరు తక్కువగా తాగితే మలబద్ధకం సమస్య వస్తుంది. అలాగే చిరాకు, ఏకాగ్రత లోపం ఏర్పడుతుంది. డీహైడ్రేషన్ పిల్లల్లో చిరాకు, ఏకాగ్రత లోపానికి కారణమవుతుంది.
(unsplash)(5 / 6)
పిల్లలకు ఇష్టమైన కప్పుల్లో నీరు ఇవ్వండి. నీటిలో నిమ్మరసం లేదా పండ్ల ముక్కలు కలపండి. వారికి తరచుగా నీరు తాగమని గుర్తు చేయండి. భోజనం, ఆట తర్వాత నీరు తాగడం అలవాటు చేయండి.
(unsplash)ఇతర గ్యాలరీలు