Fats and Weight: బరువు పెరగడంలో కొవ్వు పదార్థాల ప్రమేయం ఎంత? పిండి పదార్థాలు, కొవ్వుల్లో ఏది అసలు కారణం..
- Fats and Weight: ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఊబకాయం ఉన్న వారిలో మధుమేహం సమస్య ఎక్కువగా ఉంటుంది. మధుమేహం, ఊబకాయం రెండు ఉన్న వారిలో గుండె జబ్బులకు సంబంధించిన అధరోస్ల్కిరోసిస్ సమస్య కనిపిస్తుంది.
- Fats and Weight: ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఊబకాయం ఉన్న వారిలో మధుమేహం సమస్య ఎక్కువగా ఉంటుంది. మధుమేహం, ఊబకాయం రెండు ఉన్న వారిలో గుండె జబ్బులకు సంబంధించిన అధరోస్ల్కిరోసిస్ సమస్య కనిపిస్తుంది.
(1 / 8)
గుండె జబ్బులకు కారణం అవుతున్నాయని భావించే కొలెస్ట్రాల్‌పై పలు పరిశోధనలు జరిగాయి. రక్తంలో పారాడే అనేక కణాల్లో కొలెస్ట్రాల్ కూడా ఒకటి మాత్రమే. ప్రీ ఫాటీ ఆమ్లాలు, ట్రై గ్లిజరైడ్లు వంటివి కూడా ఇందులో ఉంటాయి.
(2 / 8)
ఆహారంలో తినే కొవ్వుల వల్ల కాకుండా ఇతర పదార్ధాల వల్ల రక్తంలో లిపో ప్రొటీన్లు పెరగడాన్ని పరిశోధనల్లో గుర్తించారు. ఆహారంలో కొవ్వులు తగ్గితే హెచ్‌డిఎల్ కూడా తగ్గుతోంది. ఫలితంగా పిండి పదార్ధాల ఎల్‌డిఎల్ పెరిగింది. తక్కువ కొవ్వులు, ఎక్కువ పిండి పదార్ధాలు గుండె జబ్బుల్ని పెంచుతున్నాయి.
(3 / 8)
కొవ్వు పదార్ధాలు, జంతువుల కొవ్వుల వల్ల బరువు పెరుగుతున్నారనే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందనే వాదనల్లో పూర్తిగా సత్యం లేదని 1950లో జాన్ గోఫ్‌మాన్ చేసిన పరిశోధనల్లో తేలింది.
(4 / 8)
అహ్రెన్స్ అనే పరిశోధకుడు ట్రై గ్లిజరైడ్స్‌పై అధ్యయనం చేశాడు. తక్కువ కొవ్వులతో కూడిన ఆహారం తీసుకున్నపుడు ట్రై గ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటాన్ని , అధిక కొవ్వులు ఆహారంలో తీసుకుంటే అవి తగ్గడాన్ని గుర్తించారు.
(5 / 8)
శరీరంలో ట్రై గ్లిజరైడ్స్ పెరగడానికి ఆహారంలో కొవ్వుల కంటే అధిక పిండి పదార్ధాలతో కూడిన ఆహార పదార్దాలే ఎక్కువ కారణమవుతున్నాయని అహ్రెన్స్ నిరూపించారు. శారీరక శ్రమతో తక్కువ క్యాలరీలు ఆహారం తీసుకుంటే ఇవి పెరగడం లేదు.
(6 / 8)
రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు ఎక్కువ కాలం పెరిగి కొనసాగితే అధరోస్ల్కిరోసిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వారిని కొవ్వులు తగ్గించి తినమని సూచిస్తే ఎక్కువ నష్టం కలుగుతుంది.
(7 / 8)
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పరిశోధనల్లో గుండె జబ్బులున్న వారిలో ట్రై గ్లిజరైడ్ స్థాయి అధికంగా ఉండటానికి తక్కువ కొవ్వులతో కూడిన పిండి పదార్ధాలే కారణమని గుర్తించారు.
(8 / 8)
పిండి పదార్ధాలతో కూడిన ఆహారం నుంచి కాలేయం ట్రైగ్లిజరైడ్లను తయారు చేస్తుంది. వాటి వాహకాలుగా ఎల్‌డిఎల్, విఎల్‌డిఎల్ పనిచేస్తాయి. ఎల్‌డిఎల్ పెరగడం, హెచ్‌డిఎల్ తగ్గడం గుండె జబ్బులకు సూచికగా భావించాలి. కొవ్వులు పెంచుతూ పోయే కొద్ది గుండె జబ్బులకు ప్రమాదం తగ్గుతోందని క్రాస్స్ పరిశోధనలు రుజువు చేశాయి.
ఇతర గ్యాలరీలు