(1 / 5)
చంద్రుడి (Moon) లాంటి ఉపగ్రహాలు, గ్రహ శకలాలు కూడా సౌర వ్యవస్థలో భాగమే. భూమికి చంద్రుడు (Moon) ఒక్కటే ఉపగ్రహంగా ఉంది. మన సౌర వ్యవస్థ (Solar System) లో మొత్తంగా వివిధ గ్రహాలకు మొత్తం కలిపి 200 ఉపగ్రహాలు ఉన్నాయని నాాసా (NASA) పేర్కొంది.
(REUTERS)(2 / 5)
కక్ష్యలో తిరుగుతున్నప్పుడు.. సూర్యుడు, చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో చంద్రుడిపై సూర్య కాంతికి భూమి అడ్డంగా ఉంటుంది. దీంతో చంద్రుడిపై నీడ పడుతుంది. దీంతో భూమిపై చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఇది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం. మరొకటి పాక్షిక చంద్రగ్రహణం. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. అలాగే, భూమి చుట్టూ మూన్ తిరుగుతుంటుంది.
(Anuwar Hazarika /ANI)(3 / 5)
కక్ష్యలో తిరుగుతున్న సమయంలో సూర్యుడి కాంతి.. చంద్రుడిపై పూర్తిగా పడకుండా భూమి అడ్డుపడితే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అలాగే, భూమి నీడ కొద్దిగా మాత్రమే చంద్రుడిప పడితే అప్పుడు ఇది పాక్షికంగా ఉంటుంది.
(REUTERS)(4 / 5)
చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు కొన్ని దశల్లో చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. భూమి అంచుల ద్వారా సూర్య కాంతి.. చంద్రుడిపై పడినప్పుడు ఇలా జరుగుతుంది.
(Samir Kar / ANI)(5 / 5)
చంద్రుడిపై ప్రపంచంలోని ఏ దేశానికి ప్రత్యేక అధికారం ఉండదనేలా ఓ అంతర్జాతీయ చట్టం కూడా ఉంది.
(AFP)ఇతర గ్యాలరీలు