Food And Health: ఆహారం తీసుకోకపోతే శరీరంలో ఏం జరుగుతుంది? ఉపవాసాలు మంచివేనా?-what happens to the body if you dont eat is fasting good ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Food And Health: ఆహారం తీసుకోకపోతే శరీరంలో ఏం జరుగుతుంది? ఉపవాసాలు మంచివేనా?

Food And Health: ఆహారం తీసుకోకపోతే శరీరంలో ఏం జరుగుతుంది? ఉపవాసాలు మంచివేనా?

Jan 02, 2025, 01:26 PM IST Bolleddu Sarath Chandra
Jan 02, 2025, 01:26 PM , IST

  • Food And Health: మనం తినే ఆహారం శరీర నిర్మాణానికి ఉపయోపడుతుంది. ప్రతి రోజు కొత్త కణాల నిర్మాణానికి ఆహారమే ప్రధాన వనరుగా ఉపయోగపడుతుంది.శరీరం చేసే అన్ని రకాల చర్యలకు కావాల్సిన శక్తి ఆహారం నుంచి లభిస్తుంది. ఈ క్రమంలో అసలు ఆహారం తీసుకోకపోతే శరీరంలో ఏమి జరుగుతుందో చూద్దాం…

రకరకాల కారణాలతో  కొన్ని సార్లు ఆహారం తీసుకోకుండా ఉండాల్సి వస్తుంది. జీర్ణ వ్యవస్థలో లోపాలు, నిరాహార దీక్షలు, అనారోగ్య సమస్యలు, పక్షవాతం, కోమాలో ఉన్నపుడు నిరాహార స్థితిలో శరీరం ఉండాల్సి వస్తుంది. 

(1 / 10)

ఆహారం తీసుకోని స్థితిలో శరీరం ఉన్నపుడు శరీరానికి కావాల్సిన శక్తి కోసం  తనలో ఉన్న కణజాలాన్ని కేలరీలుగా మార్చుకుని వినియోగించుకుంటుంది. ఫలితంగా శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కణాలు క్రమంగా కరిగిపోతాయి. 

(2 / 10)

సుదీర్ఘ కాలం నిరాహార స్థితిలో ఉంటే క్రమంగా బరువును కోల్పోతారు. పెద్ద వారిలో కంటే ఇలా  బరువును కోల్పోవడం పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. 

(3 / 10)

సరైన ఆహారం శరీరానికి లభించకపోతే  జీర్ణ వ్యవస్థలో జీర్ణ రసాలు తగ్గిపోతాయి. దీని వల్ల  క్రమంగా డయేరియా బారిన పడొచ్చు. 

(4 / 10)

శరీరానికి ఆహారం లభించకపోతే గుండె పరిమాణం తగ్గిపోతుంది. గుండె చలనంలో కూడా మార్పులు వస్తాయి. లోబీపీకి దారి తీయొచ్చు. ఎక్కువ రోజలు ఆహారం తీసుకోకపోతే హార్ట్ ఫెయిల్యూర్‌కు దారి తీసే అవకాశం ఉంది. 

(5 / 10)

ఆహారం ఎక్కువ రోజుల పాటు తీసుకోకుండా ఉంటే  శ్వాస నిదానిస్తుంది.  శ్వాసకోశ వ్యవస్థ క్రమంగా దెబ్బతింటుంది.  శరీరం శక్తిని కోల్పోతే  చివరకు శ్వాసించడం కూడా కష్టం కావొచ్చు.  

(6 / 10)

దీర్ఘకాలంగా ఉపవాసాలు చేస్తే స్త్రీలలో అండాశయం, పురుషుల్లో వృషణాలు పరిమాణం తగ్గిపోతుంది.  సెక్సు కోరికలు తగ్గిపోతాయి.  స్త్రీలలో రుతుస్రావం ఆగిపోతుంది. 

(7 / 10)

ఆహారం తీసుకోకపోతే చికాకు, ఉదాసీనత, మెదడు పనితీరులో అపసవ్యత చోటు చేసుకుంటాయి.  కండరాల క్షీణత, బలం తగ్గిపోతాయి. క్రమంగా రక్తహీనత ఏర్పడుతుంది.  శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది.  అనేక రకాల దుష్ప్పభావాలు ఉంటాయి. 

(8 / 10)

ఆహారం తీసుకోకపోతే శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది. చర్మం అడుగున ఉండే కొవ్వు అదృశ్యమై దాని స్థానంలో చర్మం కింద నీరు చేరుతుంది. 

(9 / 10)

సరైన పోషకాలు, ఆహారం శరీరానికి క్రమంగా తప్పకుండా అందకపోతే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ కూడా గాడి తప్పుతుంది. శరీరానికి ఇన్‌ఫెక్షన్స్‌తో పోరాడే శక్తి తగ్గిపోతుంది. శరీర గాయాలు కూడా త్వరగా తగ్గవు. 

(10 / 10)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు