TG Indiramma Housing App : 'ఇందిరమ్మ ఇళ్ల యాప్'లో ఏ వివరాలను ఎంట్రీ చేస్తారు..? వీటిని తెలుసుకోండి-what details are entered in the telangana indiramma housing scheme app ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Indiramma Housing App : 'ఇందిరమ్మ ఇళ్ల యాప్'లో ఏ వివరాలను ఎంట్రీ చేస్తారు..? వీటిని తెలుసుకోండి

TG Indiramma Housing App : 'ఇందిరమ్మ ఇళ్ల యాప్'లో ఏ వివరాలను ఎంట్రీ చేస్తారు..? వీటిని తెలుసుకోండి

Dec 07, 2024, 01:13 PM IST Maheshwaram Mahendra Chary
Dec 07, 2024, 01:13 PM , IST

  • TG Indiramma Housing Scheme App : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అమలు కోసం 'యాప్' అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. ప్రజల వివరాలను ఎంట్రీ చేసి… అన్ని కోణాల్లో క్రోడీకరించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇటీవలే ప్రత్యేక మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది. అంతేకాకుండా… ఇందిరమ్మ ఇంటి నమూనాను కూడా విడుదల చేసింది.

(1 / 7)

ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ ద్వారా ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు.  దరఖాస్తుదారుల వివరాలను ఎంట్రీ చేసి… లబ్ధిదారులను గుర్తిస్తారు. యాప్ అందుబాటులోకి రావటంతో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రక్రియ వేగవంతం కానుంది.

(2 / 7)

ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. ఆయా దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి సర్వేయర్లు యాప్ లో వివరాలను నమోదు చేయనున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ మొదలైంది.

(3 / 7)

ఇంటికి వచ్చే సర్వేయర్లు… దరఖాస్తుదారుడి అన్ని వివరాలను సేకరిస్తారు. గతంలో ఏదైనా ఇంటి స్కీమ్ లో లబ్ధి పొందారా..? ఎలాంటి వాహనాలు ఉన్నాయి..? స్థలం ఎవరి పేరుపై ఉంది..? కుటుంబంలో ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారా..? ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లింపుతో పాటు ఇతర వివరాలను తీసుకుంటారు.

(4 / 7)

దరఖాస్తుదారుడు ఇచ్చే సమాచాన్ని యాప్ లో నమోదు చేసిన తర్వాత అన్ని కోణాల్లో క్రోడీకరిస్తారు. ఇందులో ఏఐ టెక్నాలజీ కీలకంగా పని చేయనుంది. అన్నింటిని పరిశీలించిన తర్వాతే… అసలైన నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తారు. 

(5 / 7)

తొలి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లను కేటాయిస్తారు. మొత్తంగా 4.5 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను ధపాలు వారీగా ఇస్తారు.

(6 / 7)

లబ్ధిదారులకు మరో వెసులుబాటును కూడా సర్కార్ కల్పించింది. ప్రభుత్వం అందించే 400 చదరపు అడుగుల డిజైన్ ను అనుసరించాల్సిన పని లేదు. ఇంకా స్థలం కలిగి ఉంటే 500 చదరపు అడుగుల్లోనూ ఇల్లు కట్టుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు