మొదటి రాత్రి కలయిక తర్వాత ఆడవారి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఓ లుక్కేయండి!-what changes occur in a woman body after the first night ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మొదటి రాత్రి కలయిక తర్వాత ఆడవారి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఓ లుక్కేయండి!

మొదటి రాత్రి కలయిక తర్వాత ఆడవారి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఓ లుక్కేయండి!

Dec 30, 2024, 09:56 AM IST Ramya Sri Marka
Dec 28, 2024, 06:26 PM , IST

మొదటి రాత్రి గురించి పురుషుల్లో ఎంత ఆతృత ఉంటుందో స్త్రీలలో అంతకుమించి భయం ఉంటుంది.  సెక్స్ తర్వాత వారి శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి ఎన్నో సందేహాలు కూడా ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయాల్సిందే.

కన్యత్వం అనేది ఒక పొర (హైమెన్) ఉనికిని సూచిస్తుంది.ఇది మహిళలందరిలో ఒకేలా ఉండదు. మీరు మొదటిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు రక్తస్రావం సంభవిస్తుందనేది ఒక అపోహ. ఇది అందరి ఆడవాళ్లకూ తప్పక జరిగేది మాత్రం కాదు. కొందరికి యోని దగ్గర కొద్దిగా వాపు, అసౌకర్యంగా అనిపించవచ్చు. ఇది కొన్ని రోజుల్లోనే తగ్గిపోతుంది.

(1 / 6)

రతి సమయంలో హార్మోన్లు మారి శరీరం సంతోషంగా ఉంటుంది. కొందరికి చర్మంపై ఎర్రటి మచ్చలు, మరకలు ఏర్పడతాయి.

(2 / 6)

శృంగారం తర్వాత జీవిత భాగస్వామితో సంతోషం, సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ భాగస్వామితో సంబంధాలు బలపడవచ్చు లేదా కొత్త సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబం, స్నేహితులతో సంబంధాలు వ్యక్తిగత అనుభవంపై ఆధారపడి ఉంటాయి.

(3 / 6)

సురక్షితమైన శృంగారంలో పాల్గొనకపోతే యోనిలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అనుకోకుండా గర్భం దాల్చే అవకాశం కూడా ఉంది. కొందరు స్త్రీలతో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది.

(4 / 6)

సమాజం శృంగారాన్ని ఎలా చూస్తుందనే దానిపై ప్రభావం స్త్రీల మీద కచ్చితంగా పడుతుంది. లైంగికతపై సరైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. శరీరం, సెక్స్ గురించి తెలుసుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లైంగిక జీవితంలో ఆనందం ఉంటుంది. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది

(5 / 6)

మొదటి సెక్స్ తర్వాత, కొందరు స్త్రీలు సంతోషం, ఆనందం లేదా ప్రేమ భావనతో నిండిపోతారు. కానీ మరికొంతమంది మహిళలు, ఈ అనుభవాన్ని జాగ్రత్తగా ఆలోచించి భయాలు అనుమానాలకు లోనవచ్చు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు