Virat Kohli IPL Records: కోహ్లీని దాటే ఆటగాడున్నాడా? ఐపీఎల్ లో ఈ రికార్డులు బ్రేక్ అయ్యేనా.. ఈ లిస్ట్ పై లుక్కేయండి-what are the virat kohli records in ipl can any cricketer break it top scorer in league most centuries most catches ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Virat Kohli Ipl Records: కోహ్లీని దాటే ఆటగాడున్నాడా? ఐపీఎల్ లో ఈ రికార్డులు బ్రేక్ అయ్యేనా.. ఈ లిస్ట్ పై లుక్కేయండి

Virat Kohli IPL Records: కోహ్లీని దాటే ఆటగాడున్నాడా? ఐపీఎల్ లో ఈ రికార్డులు బ్రేక్ అయ్యేనా.. ఈ లిస్ట్ పై లుక్కేయండి

Published Mar 27, 2025 02:47 PM IST Chandu Shanigarapu
Published Mar 27, 2025 02:47 PM IST

  • Virat Kohli IPL Records: ఐపీఎల్ లో విరాట్ కోహ్లి క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ రికార్డుల రారాజు లీగ్ లోనూ అదరగొడుతున్నాడు. ఐపీఎల్ లో అతని రికార్డులకు కొదవలేదు. టాప్ స్కోరర్ నుంచి మొదలు పెడితే ఎన్నో రికార్డులున్నాయి. మరి వీటిని బ్రేక్ చేసే ఆటగాళ్లున్నారా? ఛాన్స్ లు ఎలా ఉన్నాయో? ఓ లుక్కేయండి.

ఐపీఎల్ హిస్టరీలో టాప్ స్కోరర్ గా కింగ్ కోహ్లి కొనసాగుతున్నాడు. విరాట్ 245 ఇన్నింగ్స్ ల్లో 8,063 పరుగులు చేశాడు. సెకండ్ ప్లేస్ లో ఉన్న ధావన్ ఖాతాలో 6,769 పరుగులున్నాయి. ఐపీఎల్ టాప్ స్కోరర్ గా కోహ్లి రికార్డును ఇప్పట్లో బ్రేక్ చేసే అవకాశాలు కనిపించట్లేదు.

(1 / 5)

(REUTERS)

ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డు చూసుకుంటే అత్యధిక సెంచరీల్లోనూ కోహ్లి టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఈ ఆర్సీబీ స్టార్ 8 సెంచరీలు చేశాడు. అయితే ఈ రికార్డు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సెకండ్ ప్లేస్ లో ఉన్న బట్లర్ (7)కు కోహ్లికి తేడా ఒకటే సెంచరీ. బట్లర్ ఏమైనా కోహ్లిని దాటుతాడేమో చూడాలి.

(2 / 5)

(AFP)

ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి కొనసాగుతున్నాడు. 2016 ఐపీఎల్ లో విరాట్ 973 రన్స్ చేశాడు. ఈ రికార్డు ఇప్పట్లో బ్రేక్ అయ్యే ఛాన్స్ లేనట్లే. 2023లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్ మన్ గిల్ 890 పరుగులు చేశాడు. ఈ కోహ్లి రికార్డును తిరగరాయాలంటే సీజన్ సాంతం నిలకడగా రాణించాల్సిందే.

(3 / 5)

ఫీల్డర్ గాను ఐపీఎల్ లో విరాట్ కోహ్లికి తిరుగేలేదు. గ్రౌండ్ లో చిరుత వేగంతో కదిలే కోహ్లి.. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక క్యాచ్ లు పట్టిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. 114 క్యాచ్ లతో కోహ్లి టాప్ ప్లేస్ లో ఉన్నాడు. సురేశ్ రైనా 109 క్యాచ్ లతో సెకండ్ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆడుతున్న ప్లేయర్లలో జడేజా (104), రోహిత్ (101) మాత్రమే కోహ్లికి చేరువగా ఉన్నారు.

(4 / 5)

(Surjeet Yadav)

ఐపీఎల్ లో హైయ్యస్ట్ పార్ట్‌న‌ర్‌షిప్‌ రికార్డులోనూ కోహ్లి ఉన్నాడు. ఏబీ డివిలియర్స్, కోహ్లి కలసి 2016లో సెకండ్ వికెట్ కు 229 రన్స్ పార్ట్‌న‌ర్‌షిప్‌ క్రియేట్ చేశారు. అప్పటి గుజరాత్ లయన్స్ పై చిన్నస్వామి స్టేడియంలో కోహ్లి-డివిలియర్స్ మోత మోగించారు. ఏ వికెట్ కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఈ రికార్డ్ బ్రేక్ అవడం కష్టమే.

(5 / 5)

(Hindustan Times)

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు