(1 / 6)
కొన్నిసార్లు పేరెంట్స్ చేసే పనులు తమని పిల్లలకు దగ్గర చేయడం కాకుండా, వారిని మరింత దూరం చేసుకునేలా ఉంటాయి. పిల్లలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మన పనులు వారిపై చెరగని ముద్రను తీసుకొస్తాయి.
(Pexel)(2 / 6)
ఆలోచనలను తోసిపుచ్చడం - మీరు బిజీగా ఉన్నప్పుడు పిల్లలు చెప్పే మాటలను, వారి ఆలోచనలను వాయిదా వేస్తుంటారు. అదే విధంగా ప్రతిసారీ ప్రవర్తించడం వల్ల వారిని కించపరిచినట్లు అవుతుంది. వీలైనంత వరకూ వారి మాటలు వినడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
(Pexel)(3 / 6)
ఇష్టాలను వాయిదా వేయకండి - స్పోర్ట్స్, మ్యూజిక్స్, చదువుకోవడం వంటి విషయాల్లో పార్టిసిపేట్ చేయడం మంచిదే. కానీ, వారి ఇంటరస్ట్ లకు తగ్గట్టుగా గడిపేలా కాస్త సమయాన్ని వదిలేయండి.
(Pexel)(4 / 6)
ఇచ్చిన మాట తప్పడం - పిల్లల ప్రపంచంలో మాట ఇవ్వడం అంటే చాలా పెద్ద విషయం. వారికి ఇచ్చిన మాటలను మీరు తరచూ తప్పుతూ ఉంటే, మీపై నమ్మకం కోల్పోతారు. అది చిన్నదైనా, పెద్దదైనా మాట తప్పకుండా ఉండటానికే ప్రయత్నించండి.
(5 / 6)
కోపాన్ని బయటపెట్టేయడం - పేరెంటింగ్ కచ్చితంగా ఒత్తిడితో కూడిన విషయమే. కానీ, పిల్లల ముందు మీ కోపాన్ని బయటపెట్టడం వారికి మీ గురించి తప్పుడు అభిప్రాయాన్ని కలుగజేస్తుంది. దీనిని బట్టి ఫ్రస్ట్రేషన్ తొలగిపోవాలంటే కోప్పడాలనే ఫీలింగ్ వారిలో మొదలవుతుంది.
(Pexel)(6 / 6)
మీపై మీరు శ్రద్ధ చూపించకపోవడం - ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను బాగా చూసుకోవాలనే తాపత్రయంలో తమపై తాము శ్రద్ధ కనబరచరు. ఇలా చేయడం వల్ల వారికి మీ పట్ల చికాకు కలుగుతుంది. అంతేకాకుండా, వారు ఇతరుల పట్ల కేరింగ్ తీసుకునే విషయంలో తమ గురించి పట్టించుకోకూడదని ఫీలవుతారు.
(Pexel)ఇతర గ్యాలరీలు