(1 / 5)
ఉమ్మడి వరంగల్ జిల్లా తాడ్వాయి, పస్రా అటవీ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ అయ్యింది. అదే సమయంలో భారీ గాలులు వీయడంతో.. అడవి విధ్వంసం జరిగింది. ఇదే విషయాన్ని అటవీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. 200 హెక్టార్ల అటవీ ప్రాంతంలో 50 వేలకు పైగా చెట్లు కూలిపోయాయని నివేదించారు.
(2 / 5)
గతనెల 31న తాడ్వాయి, పస్రా అడవుల్లో జరిగిన ఘటనపై.. అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. ఈ ప్రాంతాల్లోనే క్లౌడ్ బరస్ట్‌కు దారితీసే వాతావరణ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి.. మేఘాలు కిందికి ఎందుకు వచ్చాయన్న అంశంపై అధ్యయనం చేయించాలని కోరారు.
(3 / 5)
తాడ్వాయి- పస్రా రేంజి పరిధిలో దట్టమైన అడవి ఉంటుంది. గతనెల 31న సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో బలమైన గాలులతో కుండపోత వర్షం కురిసింది. బలమైన గాలుల కారణంగా.. చెట్లు కూలిపోయాయి. దాదాపు 3 కిలో మీటర్ల పొడవు, అర కిలో మీటరు వెడల్పులో అటవీ ప్రాంతానికి భారీ నష్టం వాటిల్లింది.
(4 / 5)
అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలో కీలక విషయాలు గుర్తించారు. చెట్లు కూలిన ప్రాంతం సారవంతమైన నేల అని గుర్తించారు. అయితే.. చెట్ల వేర్లు భూమి లోపలికి కొద్దిమేరకే ఉన్నాయని.. ఆ కారణంగానే గాలి, వానలకు చెట్లు నిలవలేకపోయాయని అధికారులు భావిస్తున్నారు.
(5 / 5)
ఇటీవల ధ్వంసమైన ప్రాంతాలను సంరక్షిస్తే.. అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించవచ్చని అధికారులు భావిస్తున్నారు. నష్టం జరిగిన అటవీ ప్రాంతానికి ఆనుకునే మంచి అడవి ఉందని చెబుతున్నారు. వాటి నుంచి వచ్చే విత్తనాలు చెట్లు కూలిన ప్రాంతంలో అడవుల పునరుద్ధరణకు ఉపయోగపడతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
ఇతర గ్యాలరీలు