'తల్లికి వందనం' స్కీమ్ అప్డేట్స్ - మీ వద్ద ఉండాల్సిన పత్రాలివే...!-what are the documents required for the ap govt thalliki vandanam scheme 2025 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  'తల్లికి వందనం' స్కీమ్ అప్డేట్స్ - మీ వద్ద ఉండాల్సిన పత్రాలివే...!

'తల్లికి వందనం' స్కీమ్ అప్డేట్స్ - మీ వద్ద ఉండాల్సిన పత్రాలివే...!

Published Jun 04, 2025 11:52 AM IST Maheshwaram Mahendra Chary
Published Jun 04, 2025 11:52 AM IST

ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు తల్లికి వందనం స్కీమ్ ను పట్టాలెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 12 నుంచి స్కీమ్ ను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ స్కీమ్ కింద చదువుకునే విద్యార్థులకు ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థికసాయం అందజేస్తారు. దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలెంటో ఇక్కడ తెలుసుకోండి

ఏపీ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ జూన్ 12  నుంచి  ప్రారంభించనుంది.  ఈ స్కీమ్ కింద అందే డబ్బులు జమ కావాలంటే… విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్ తో పాటు ఎన్పీసీఐతో లింక్ చేసుకోవాలని తాజాగానే ప్రభుత్వం సూచించింది.

(1 / 8)

ఈ స్కీమ్ కింద ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులవుతారు. తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం కింద డబ్బులు జమ చేస్తారు. ప్రతి సంవత్సరం 15,000 ఇస్తారు.

(2 / 8)

తల్లికి వందనం స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. విద్యార్థి స్టడీ సర్టిఫికెట్ తల్లి ఆధార్ కార్డు, తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు ఉండాలి.

(3 / 8)

దరఖాస్తు కోసం నివాస పత్రము లేదా రేషన్ కార్డ్ , కుల ధ్రువీకరణ పత్రము, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికెట్ అవసరమవుతుంది.  ఇంకా ఏమైనా పత్రాలు అవసరమైతే… ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే ప్రకటనలో తెలుసుకోవచ్చు.

(4 / 8)

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు…  రాష్ట్ర నివాసి అయి. ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న వారు అయి ఉండాలి, ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు అర్హులవుతారు.కనీసం 75 శాతం హాజరు కలిగి ఉంటేనే డబ్బులు జమవుతాయి. .తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ లిగి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి.

(5 / 8)

లింకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకునేందుకు పోస్టల్, సచివాలయ సిబ్బంది, బ్యాంకు అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు.జూన్ 5లోపే పూర్తి చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

(6 / 8)

ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 నగదు జమవుతాయి. అయితే ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్ తో పాటు ఎన్పీసీఐతో లింకింగ్ చేసుకోవాలి. ఇందుకు జూన్ 5వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

(7 / 8)

ప్రభుత్వం త్వరలోనే అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించనుంది. తల్లుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. ఈ స్కీమ్ కు సంబంధించి రేపోమాపో అధికారికంగా ప్రకటన వెలువడనుంది.

(8 / 8)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు