TG Rajiv Yuva Vikasam Scheme : ‘రాజీవ్ యువ వికాసం స్కీమ్’ అప్డేట్స్ - దరఖాస్తుకు కావాల్సిన పత్రాలివే-what are the documents required for rajiv yuva vikasam scheme know these key details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Rajiv Yuva Vikasam Scheme : ‘రాజీవ్ యువ వికాసం స్కీమ్’ అప్డేట్స్ - దరఖాస్తుకు కావాల్సిన పత్రాలివే

TG Rajiv Yuva Vikasam Scheme : ‘రాజీవ్ యువ వికాసం స్కీమ్’ అప్డేట్స్ - దరఖాస్తుకు కావాల్సిన పత్రాలివే

Published Mar 23, 2025 06:25 AM IST Maheshwaram Mahendra Chary
Published Mar 23, 2025 06:25 AM IST

  • Telangana Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణలోని యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం స్కీమ్ ను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే అప్లికేషన్ కోసం కాావాల్సిన ధ్రువపత్రాల వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ ను పట్టాలెక్కించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి రుణాలను మంజూరు చేయనుంది. ఇందుకోసం రాజీవ్‌ యువ వికాసాన్ని పథకాన్ని ప్రారంభించింది.

(1 / 8)

(image source istockphoto)

ఈ స్కీంలో భాగంగా అర్హులైన యువతకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది.. మార్చి 17 వ తేదీని ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు.

(2 / 8)

ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. స్కీమ్ కు ఎంపికైతే 60 శాతం నుంచి 80 శాతం వరకు సబ్సిడీని కూడా పొందవచ్చు.

(3 / 8)

ఏప్రిల్‌ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.  లబ్ధిదారుల్లో అర్హులను ఎంపికచేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున(జూన్ 2న) రాయితీ రుణాల మంజూరు పత్రాలు అందజేస్తారు.

(4 / 8)

ఈ స్కీమ్ కింద 160కి పైగా యూనిట్లు ఉన్నాయి. ఇవన్నీ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, అగ్రోస్, ట్రాన్స్ పోర్ట్ కేటగిరిలో ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అర్హతలకు అనుగుణంగా.. యూనిట్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ యూనిట్ పై ఎంత వరకు రాయితీ వస్తుందో కూడా వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. https://demo4.cgg.gov.in/TGOBMMSESSFORMS/ లింక్ పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

(5 / 8)

ఈ పథకం కింద  రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ స్కీమ్ ను తీసుకువచ్చారు. ఈ స్కీమ్ కోసం ఇప్పటికే చాలా మంది దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

(6 / 8)

ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవటానికి కొన్ని ధ్రువపత్రాలు అవసరపడుతుంది. ఇందులో ప్రధానంగా ఆధార్ నెంబర్, ఆధార్ కార్డు ప్రకారం దరఖాస్తుదారుడి పేరు, ఆహార భద్రత కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. ఇవే కాకుండా పాన్ కార్డు ,పాస్‌పోర్టు సైజు ఫోటో, లబ్ధిదారుడి ఫోన్ నంబర్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.

(7 / 8)

రాజీవ్‌ యువ వికాసం పథకంలో కేటగిరీ-1, 2, 3వారీగా రుణాలు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు రాయితీతో కూడిన రుణాలు అందిస్తారు.

(8 / 8)

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు