
(1 / 6)
రాజయోగాలు కొన్ని రాశుల వారికి విపరీతమైన సంపదను తెచ్చిపెడతాయి. జూన్ నెలలో 12 ఏళ్ల తర్వాత మిథున రాశిలో గురువు, సూర్యుడు కలయిక జరగబోతోంది. ఇదే గురు ఆదిత్య రాజయోగాన్ని ఏర్పాటు చేస్తుంది.

(2 / 6)
సూర్యుడు ఆత్మవిశ్వాసాన్ని సూచించే గ్రహం. ఇక బృహస్పతి జ్ఞానాన్ని సూచించే గ్రహం. ఈ ఇద్దరూ జూన్ లో ఒకే రాశిలో కలవబోతున్నారు. ఈ కలయిక కారణంగా శక్తివంతమైన గురు ఆదిత్య రాజయోగం ఏర్పడి మూడు రాశుల వారికి మేలు చేకూరుస్తుంది.

(3 / 6)
సూర్యుడు జూన్ 15న మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. మే 14న బృహస్పతి మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 17 వరకు బృహస్పతి అక్కడే ఉంటాడు. ఈ సమయంలోనే సూర్యుడు బృహస్పతి జూన్ నెలలో కలుస్తారు.

(4 / 6)
గురు ఆదిత్య రాజయోగం సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. జీవితంలో సానుకూలంగా పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో పురోగతి ఏర్పడుతుంది. డబ్బు సంబంధిత విషయాల్లో భారీ ప్రయోజనాలను పొందుతారు.

(5 / 6)
కన్యా రాశి వారికి బృహస్పతి, సూర్యుని కలయక ఎంతో ప్రయోజనకరం. జూన్ నెలలో ఆ వ్యక్తి కెరీర్, వ్యాపారంలో పెద్ద పురోగతి ఏర్పడుతుంది. ఆర్థిక లాభాలు విపరీతంగా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

(6 / 6)
మీన రాశి వారికి గురు ఆదిత్య రాజయోగం ఎంతో శుభప్రదం. రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ ప్రయోజనాలను పొందుతారు. ప్రభుత్వ పనులు కూడా పూర్తవుతాయి. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.
ఇతర గ్యాలరీలు