(1 / 5)
వేలాడే మొక్కలను ఇంటి లోపల ఉంచినప్పుడు అందంగా కనిపిస్తాయి. అయితే వీటిని ఎంచుకునే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఈ చెట్ల ఆకులు వేళాడుతూ ఉండాలి. అలాంటి మొక్కల లిస్టు చూసేయండి. వీటివల్ల అందం రెట్టింపు అవుతుంది.
((Pexels))(2 / 5)
స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్: ఈ పేరు వింటేనే భలే అనిపిస్తుంది. ముత్యాల వరస అనుకోండి. చూడ్డానికి చిన్న చిన్న బటానీలు కొమ్మలకు అతుక్కుని ఉన్నట్లు కనిపిస్తుందీ మొక్క. వీటికి తెల్లని పుష్పాలు కూడా పూస్తాయి. చాలా పెద్దగానే పెరుగుతుంది ఈ మొక్క.
(Pexels )(3 / 5)
బోస్టన్ ఫెర్న్: బోస్టన్ ఫెర్న్ మొక్కతో ఇంటికి కొత్త లుక్ వస్తుంది. ఈ మొక్కలతో ఇంట్లో పందిరి వేసినట్లు అనిపిస్తుంది. దీనికి ఆకుపచ్చ ఆకులు పొదల్లాగా పెరుగుతాయి. గుంపుగా చిన్నగా అందంగా పెరుగుతాయివి. తెల్లవారు జాము ఇవి మరింత అందంగా కనిపిస్తాయి.
(Pexels)(4 / 5)
పెటునియా: కుండీలో పెరిగే ఈ పూల మొక్కను వేళాడదీస్తే చాలా అందంగా కనిపిస్తాయి. పెటునియాలు గులాబీ, ఊదా, నీలం, తెలుపు.. అందమైన రంగులలో వికసిస్తాయి. ట్రంపెట్ ఆకారంలో ఉండే ఈ పూలు మీ ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయం. ఈ మొక్కల అందమైన రంగులు మీకు ఎల్లప్పుడూ కొత్త ఉత్సాహం ఇస్తాయి.
(Pixabay )ఇతర గ్యాలరీలు