(1 / 5)
జూన్ 27న గయానాలోని కైటూర్ న్యూస్‌లో వచ్చిన ఒక కథనం ప్రకారం టీనేజ్ అమ్మాయితో సహా కనీసం 11 మంది మహిళలు వెస్టిండీస్ అంతర్జాతీయ క్రికెటర్‌పై అత్యాచారం, లైంగిక దాడి, వేధింపులు, అవాంఛిత ప్రపోజల్స్ ఆరోపణలు చేశారు. వారిలో ఒకరు ఆ క్రికెటర్‌కు బంధువు కూడా. ప్రస్తుతం ఈ క్రికెటర్ వెస్టిండీస్ జట్టులో ఉన్నాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో ఆడతాడా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.
(2 / 5)
2023 మార్చి 3న న్యూ ఆమ్‌స్ట్రాడామ్‌లోని బెర్బిస్లోని ఓ ఇంట్లో 18 ఏళ్ల యువతిపై క్రికెటర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కథనం ప్రకారం.. క్రికెటర్ ఆమెను చాటింగ్ కోసం తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ చాలా మంది ఉన్నారు. అనంతరం ఆ క్రికెటర్ బాలికను మేడపై ఉన్న తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను కప్పిపుచ్చుకునేందుకు క్రికెటర్ కుటుంబం కూడా లంచం ఇవ్వడానికి ప్రయత్నించింది.
(AFP)(3 / 5)
ఇదిలా ఉంటే ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి పలువురు మహిళలు కూడా ముందుకు వచ్చి ఆ స్టార్ క్రికెటర్‌పై ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన క్రూరమైన సంఘటనలను వివరించడానికి వారు స్క్రీన్ షాట్లు, వాయిస్ నోట్స్, మెడికల్ ఫైలింగ్స్, సందేశాలను సాక్ష్యాలుగా చూపించారు.
(AFP)(4 / 5)
అయితే, బాధితురాలికి ఆర్థిక పరిహారం ఇచ్చేందుకు క్రికెటర్ ఫ్యామిలీ ప్రయత్నించగా అందుకు బాధితిరాలి కుటుంబం నిరాకరించింది. "మాకు డబ్బు అవసరం లేదు. నా కూతురికి న్యాయం చేయాలని కోరుతున్నాను" అని బాధితురాలి తండ్రి మీడియాకు తెలిపాడు. కాగా, ఈ అత్యాచార ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు. ఫిర్యాదుదారుల్లో ఒకరి తరఫు న్యాయవాది నిగెల్ హ్యూస్ స్పోర్ట్స్ మ్యాక్స్ టీవీతో మాట్లాడుతూ.. “ప్రాథమిక ఫిర్యాదులు రెండేళ్ల క్రితం 2023 ప్రారంభంలో వచ్చాయి. ఈ ఆరోపణల ఆధారంగా ప్రాథమిక దర్యాప్తు జరుగుతోంది. అభియోగాలు నమోదు చేయాలని ప్రాసిక్యూటర్ సిఫార్సు చేశారు. కానీ, ఆ తర్వాత అంతా ఆగిపోయింది” అని తెలిపారు.
(AFP)(5 / 5)
అయితే, ఈ ఘటనను కప్పిపుచ్చడం వెనుక పలుకుబడి ఉన్న వ్యక్తుల ఒత్తిళ్లు కూడా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అంతకుముందు 2024లో వెస్టిండీస్ జట్టుతో కలిసి ఆస్ట్రేలియాలో పర్యటించాడు ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు క్రికెటర్. తిరిగి వచ్చాక గయానాలో హీరోగా ప్రశంసలు అందుకున్నాడు. అత్యాచార ఆరోపణల గురించి తమకు తెలియదని క్రికెట్ వెస్టిండీస్ తెలిపింది.
(AP)ఇతర గ్యాలరీలు