తెలుగు న్యూస్ / ఫోటో /
NPCI Linking Online : ఆన్ లైన్ లో బ్యాంక్ ఖాతా, ఆధార్ నెంబర్ లింక్- ఎన్పీసీఐ ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు
NPCI Linking Online : బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్(NPCI) చేయించేందుకు లబ్దిదారులు బ్యాంకుకు వెళ్లకుండానే మొబైల్ లోనే చేసుకునే విధానం అందుబాటులో తెచ్చింది కేంద్రం. ఇందుకోసం ఖాతాదారులు ముందుగా NPCI అధికారిక వెబ్ సైట్ https://www.npci.org.in/ లోకి వెళ్లి లింక్ చేసుకోవవచ్చు.
(1 / 6)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. సంక్షేమ ఫలాలను నేరుగా లబ్దిదారులకే అందించేందుకు డీబీటీ(నేరుగా ఖాతాల్లో నగదు జమ) విధానం అమలు చేస్తున్నాయి. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.
(2 / 6)
లబ్దిదారుల ఆధార్ నెంబర్ లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాలకు సంక్షేమ పథకాల నగదు బదిలీ చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో లబ్దిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో సిలిండర్ నగదు జమ చేస్తుంది. ఇందుకోసం బ్యాంకు ఖాతాకు ఎన్పీసీఐ(ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్) లింక్ చేసుకోవాలని సూచించింది. ఎన్పీసీఐ లింక్ ఉన్న వారికే నగదు జమ అవుతుంది.
(3 / 6)
బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్(NPCI) చేయించేందుకు లబ్దిదారులు బ్యాంకుకు వెళ్లకుండానే మొబైల్ లోనే చేసుకునే విధానం అందుబాటులో తెచ్చింది కేంద్రం. ఇందుకోసం ఖాతాదారులు ముందుగా NPCI అధికారిక వెబ్ సైట్ https://www.npci.org.in/ లోకి వెళ్లాలి.
(4 / 6)
హోమ్ పేజీలో 'Consumer' ఆప్షన్ పై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పై స్టేటస్ బార్ లో మీకు 'Bharat Aadhar Seeding Enabler(BASE)' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి.
(5 / 6)
ముందుగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి "Seeding" ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు మూడు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో ఇప్పటి వరకు NPCI లింక్ లేని వారికి 'Fresh Seeding' ఆప్షన్ ఎంచుకుని బ్యాంక్ పేరును సెలెక్ట్ చేసి, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేసి ఎన్పీసీఐ లింక్ కోసం రిక్వెస్ట్ పంపవచ్చు. సబ్మిట్ చేసిన 24 గంటలలోపు ఎన్పీసీఐ లింక్ అవుతుంది.
(6 / 6)
ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి మాత్రమే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. అలాగే ఈ లింక్ లో ఉన్న బ్యాంకులకు మాత్రమే ఎన్పీసీఐ రిక్వెస్ట్ పంపేందుకు అవకాశం ఉంటుంది. NPCI లింక్ చేసుకునేందుకు కొన్ని బ్యాంకుల పేర్లు ఈ వెబ్సైట్ లో రావడంలేదు. అలాంటి వారు నేరుగా బ్యాంకు లేదా పోస్టాఫీసు ద్వారా ఎన్పీసీఐ లింక్ చేసుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు