తెలుగు న్యూస్ / ఫోటో /
Weight Loss Tips: పండుగ సందర్భంగా విందు భోజనాలతో బరువు పెరిగారా?.. మళ్లీ స్లిమ్ కావాలంటే ఈ టిప్స్ ఫాలో కండి..
Healthy dite: బరువు తగ్గడానికి కీలకం సరైన ఆహారం. సరైన ఆహారాన్ని, సరైన మోతాదులో, సరైన సమయంలో తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించవచ్చు.
(1 / 6)
నవరాత్రులు ఇప్పుడే గడిచిపోయాయి, ఇప్పుడు దీపావళి, క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలు వస్తున్నాయి. ఈ వేడుకల్లో సాధారణంగా బయటి ఆహారం తింటుంటాం. దాంతో, బరువు పెరగడం సహజం.
(2 / 6)
చక్కెర తీసుకోవడం పూర్తిగా మానేయండి. స్వీట్లు తినవద్దు. మీరు స్వీట్స్ తినకుండా ఉండలేను అనుకుంటే బెల్లం లేదా కొబ్బరితో చేసిన సహజ స్వీటెనర్‌ను ఉపయోగించవచ్చు.
(3 / 6)
కనీసం వారానికి ఒక రోజు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండలేననుకుంటే, 14-10 గంటల నియమాన్ని అనుసరించండి. అంటే, 14 గంటల పాటు ఆహారం లేకుండా ఉండండి. మీరు రాత్రి 8 గంటలకు భోజనం చేస్తే, ఉదయం 10 గంటలకు అల్పాహారం తీసుకోండి. ఆహారం తీసుకునే 10 గంటల సమయంలో కూడా మితంగా, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.
(4 / 6)
బరువు తగ్గడానికి కీలకం శరీరంలో కేలరీల లోటును సృష్టించడం. అంటే, మీకు 1400 కేలరీలు అవసరమైతే, 1100-1200 కేలరీలు తినండి. పేరుకుపోయిన కొవ్వును కరిగించడం ద్వారా మీ శరీరం అదనపు కేలరీలను పొందుతుంది. ఆన్‌లైన్ క్యాలరీ కాలిక్యులేటర్ సహాయంతో మీకు రోజుకు ఎన్ని కేలరీలు అవసరమో గుర్తించండి.(Freepik)
(5 / 6)
బరువు తగ్గించే విషయంలో ఆహారం 70 శాతం పాత్ర పోషిస్తుందని, వ్యాయామం 30 శాతం పాత్ర పోషిస్తుందని గుర్తుంచుకోండి.
(6 / 6)
బరువు తగ్గాలంటే తగినంత నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ యొక్క నివేదిక ప్రకారం, నిద్రలో మానవ శరీరం నుండి గ్రోత్ హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ విడుదలైనప్పుడు కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. అంతే కాకుండా శరీరంలోని కండరాలు కూడా బలపడతాయి. ప్రతీరోజు 7-8 గంటలు నిద్రించడానికి ప్రయత్నించండి. అవసరమైతే, మీరు మధ్యాహ్న సమయంలో అరగంట నుండి 1 గంట వరకు చిన్న కునుకు తీసుకోవచ్చు.(Freepik)
ఇతర గ్యాలరీలు