తెలుగు న్యూస్ / ఫోటో /
AP Telangana Weather : ద్రోణి ఎఫెక్ట్..! ఇవాళ, రేపు ఏపీలో వర్షాలు
- AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అంతేకాకుండా నాలుగైదు రోజులుగా పొగమంచు ఎక్కువగా ఉంటుంది. ఉదయం వేళలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 5)
తెలంగాణ ప్రాంతంలో ఈ రెండు రోజుల పాటు అత్యంత చలి తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
(2 / 5)
ఇవాళ, రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పొగమంచు పరిస్థితులు అధికంగా ఉంటుందని హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
(3 / 5)
ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే ఇదే సమయంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
(4 / 5)
సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తులో దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి మరియు దానికి అనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుందని ఐఎండీ వివరించింది.
ఇతర గ్యాలరీలు