తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Updates: బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం, కోస్తా సీమల్లో వర్షాలు
- AP TG Weather Updates: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడినా నేడు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, 15, 16 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP TG Weather Updates: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడినా నేడు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, 15, 16 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 6)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడినా బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్డించింది. అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి మరియు వైఎస్ఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(2 / 6)
అల్పపీడనం ప్రభావంతో గురువారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పంటలను కాపాడుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(3 / 6)
అల్పపీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమ, దక్షిణకోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
(4 / 6)
14 నవంబర్, గురువారం ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, శ్రీ సత్యసాయి వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. • అల్లూరి సీతారామ రాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు
(5 / 6)
ఈ ఏడాది పెద్దసంఖ్యలో అల్పపీడనాలు ఏర్పడటంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయి. రాయలసీమ జిల్లాల్లో మినహా కోస్తా జిల్లాల్లో సగటు కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. తెలంగాణలో కూడా నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
(6 / 6)
నవంబర్ 15, శుక్రవారం అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు