కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు - కొత్త నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలివే-warangal kakatiya distance education admission new notification 2025 released key details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు - కొత్త నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలివే

కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు - కొత్త నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలివే

Published Jun 22, 2025 10:07 AM IST Maheshwaram Mahendra Chary
Published Jun 22, 2025 10:07 AM IST

వరంగల్ కాకతీయ యూనివర్శిటీ దూర విద్యలో ప్రవేశాలకు కొత్త నోటిఫికేషన్ జారీ అయింది. డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ దరఖాస్తులకు జూలై 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి….

దూర విద్య అడ్మిషన్లకు(డిగ్రీ, పీజీ, డిప్లోమా) సంబంధించి కాకతీయ యూనివర్శిటీ కీలక అప్డేట్ ఇచ్చింది. జూలై - ఆగస్టు సెషన్ కు సంబంధించిన ప్రవేశాలపై ప్రకటన చేసింది. కొత్తగా దరఖాస్తులను స్వీకరిస్తోంది.

(1 / 6)

జూలై - ఆగస్టు సెషన్ కు సంబంధించి  బీకాం(జనరల్)/ బీకాం (కంప్యూటర్స్)/ బీబీఏ/ బీఎస్సీ(మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌)/ బీఎల్ఐసీ (వ్యవధి: మూడేళ్లు.) వంటి యూజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇక పీజీ కోర్సులు  చూస్తే ఎంఏ (ఇంగ్లిష్/ హిందీ/ సంస్కృతం/ చరిత్ర/ ఎకనామిక్స్/ పొలిటికల్ సైన్స్/ ఆర్‌డీ/ సోషియాలజీ), ఎంఏ హెచ్‌ఆర్‌ఎం/ ఎంకాం/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ జేఎంసీ/ ఎంఎస్సీ (బోటనీ/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్) ఉన్నాయి. వీరి కాల వ్యవధి రెండేళ్లుగా ఉంటుంది. డిప్లోమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

(2 / 6)

ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 20వ తేదీ నుంచి ప్రారంభమైంది. జూలై 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. నిర్ణయించిన దరఖాస్తు ఫీజు లేదా కోర్సు ఫీజును ఆన్ లైన్ విధానంలోనే చెల్లించాల్సి ఉంటుంది.

(3 / 6)

యూజీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే స్టడీ సెంటర్ ను ఎంచుకోవాలి. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవచ్చు. కోర్సుల ఫీజు వివరాలను అధికారిక వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.

(4 / 6)

కేయూ దూర విద్య వెబ్ సైట్ (https://sdlceku.co.in/index.php) లోకి వెెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. మొత్తం 46 స్టడీ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మీకు అనుగుణంగా వీటిని ఎంచుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 0870 - 2461480, 0870 -2461490 లేదా info@sdlceku.co.in  అడ్రస్ కు మెయిల్ చేయవచ్చు.

(5 / 6)

వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కూడా వేర్వురు కాంబినేషన్లు ఉండటంతో… అభ్యర్థులు జాగ్రత్తగా పరిశీలించి కోర్సులను ఎంచుకోవాల్సి ఉంటుంది. https://sdlceku.co.in/Courses.php లింక్ పై క్లిక్ చేసి కోర్సులకు సంబంధించిన అన్ని వివరాలు, అర్హతలను తెలుసుకోవచ్చు.

(6 / 6)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు