తెలుగు న్యూస్ / ఫోటో /
Weight loss tips: బరువు తగ్గాలా?.. వెయిట్ లాస్ కి ఈ మేజిక్ డ్రింక్స్ ను తప్పక ట్రై చేయాల్సిందే..
Weight loss tips: బరువు తగ్గడం ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. జీవన శైలి, ఆహార అలవాట్లు.. తదితర కారణాల వల్ల చాలామంది అధిక బరువు బారిన పడుతున్నారు. అయితే, ఈ డ్రింక్స్ మీ వెయిట్ లాస్ టార్గెట్ ను రీచ్ కావడానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. అవేంటో చూడండి..
(1 / 6)
బరువు తగ్గాలనుకుంటే కఠినమైన వ్యాయామాలు చేసి డైట్ విషయంలో కచ్చితమైన నియంత్రణ పాటించాలని చెబుతుంటారు. వాటితో పాటు ఈ డ్రింక్స్ ను రెగ్యులర్ గా తాగితే శరీరంలోని చెడు కొవ్వులు కరిగిపోయి, వెయిట్ లాస్ సాధ్యమవుతుంది.(Pixabay)
(2 / 6)
వేడి నీటిలో నిమ్మరసం, అల్లం రసం, తేనె కలిపి ఉదయమే తీసుకోవాలి. అల్లంలో ఉండే జింకోరాన్, షోగాల్స్ అనే సమ్మేళనాలు శరీరంలోని కొవ్వు నిల్వను బర్నింగ్ చేసే ప్రక్రియలను ప్రభావితం చేసి, బరువు తగ్గడానికి సహాయపడతాయి.అల్లం ఎక్కువ కాలం ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. తేనె జీర్ణక్రియకు సహాయపడుతుంది.
(3 / 6)
బరువు తగ్గడానికి నీరు ఒక ఉత్తమ మార్గం. నీటిలో కేలరీలు లేవు. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు విసర్జింపబడుతాయి. నీరు తాగడం వల్ల సగటు బరువు 5.15 శాతం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
(4 / 6)
తేనె మరియు దాల్చినచెక్కబరువు తగ్గడానికి ఇది ఒక గొప్ప మార్గం. రాత్రి సమయంలో దీనిని తీసుకోవాలి. ఒక కప్పు వేడి నీటిలో ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ దాల్చినచెక్కను రెండు నిమిషాలు నానబెట్టి త్రాగాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్ప జీవ క్రియలు సజావుగా సాగేలా చేస్తాయి.
(5 / 6)
ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జీ కాఫీని బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని కూడా అంటారు. ఇది ఆహారం ఎక్కువగా తీసుకోకుండా, ఆహార కోరికలను అరికట్టడానికి సహాయపడుతుంది. ఒక కప్పు కాఫీలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒకటి లేదా రెండు టీస్పూన్ ల కొబ్బరి నూనె కలపండి. తీపి కోసం బెల్లం పొడిని కలపొచ్చు. రెండు నిమిషాలు బాగా కలియబెట్టి త్రాగాలి.
ఇతర గ్యాలరీలు