(1 / 6)
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ప్రక్రియ షురూ అయింది. హోం ఓటింగ్ ఆప్షన్ ను ఎంచుకున్న వారి ఓట్లను ఇవాళ్టి(మే 2) సేకరించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లను చేసింది.
(Photo Source DD News Andhra )(2 / 6)
(3 / 6)
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7,28,484 మంది హోం ఓటింగ్ అర్హత కలిగి ఉన్నారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు, వీరిలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 2,11,257 మంది, 40 శాతం అంగవికలత్వం పైబడిన దివ్యాంగులు 5,17,227 మంది ఉన్నట్లు ఆయన తెలిపారు. వీరిలో కేవలం 28,591 మంది మాత్రమే హోం ఓటింగ్ విధానాన్ని ఎంచుకున్నారన్నారు.
(4 / 6)
హోం ఓటింగ్ ను ఎంచుకున్న వారిలో 14,577 మంది 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 14,014 మంది 40 శాతం అంగవికలత్వం పైబడిన దివ్యాంగులు ఉన్నారని సీఈవో వెల్లడించారు.
(Photo Source DD News Andhra )(5 / 6)
హోం ఓటింగ్ కు అర్హత ఉన్న వారిలో కేవలం 3 శాతం మంది ఓటర్లు మాత్రమే హోం ఓటింగ్ ను ఎంచుకోవడం సానుకూల సంకేతమని ఆయన అభిప్రాయ పడ్డారు.
(Photo Source DD News Andhra )(6 / 6)
మార్చి 16 న ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి ఏఫ్రిల్ 22 వ తేదీ వరకూ అధికార బృంధాలు అర్హులైన వారి నుంచి ఫారం -12D లను సేకరించడం జరిగిందని సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు
(Photo Source DD News Andhra )ఇతర గ్యాలరీలు