
(1 / 5)
ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు కూడా పాల్గొన్నారు.
(twitter)
(2 / 5)
పౌర్ణమి వెన్నెల కాంతుల్లో కోదండరాముడి కల్యాణాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు . పండువెన్నెల్లో రాత్రి 8 నుంచి 10 గంటల వరకు కల్యాణ క్రతువు పూర్తి అయింది.
(twitter)
(3 / 5)
సీతారామ కల్యాణ మహోత్సవం ఒంటిమిట్టలో చైత్ర పౌర్ణమి రోజు, పున్నమి కాంతుల్లో జరగడం ఆనవాయితీ. ఇక ఎదుర్కోలు ఉత్సవంలో భాగంగా సీతారాముల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఊరేగింపు నిర్వహించారు.
(twitter)
(4 / 5)
భక్త జన బృందాలు, చెక్క భజనలు, కోలాటాలు, కేరళ వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. స్వామి వారి కల్యాణ వేడుకను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
(twitter)
(5 / 5)
బ్రహ్మోత్సవాల సందర్బంగా చైత్ర శుద్ద చతుర్దశి నాడు అది కూడా రాత్రి పూట మాత్రమే కల్యాణోత్సవం నిర్వహించారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం ప్రాంగణంలో 52 ఎకరాల విస్తీర్ణంలో కల్యాణ వేదికను ఏర్పాటు చేశారు. రంగు రంగుల లైట్లతో ప్రాంగణం మెరిసిపోయింది.
(twitter)ఇతర గ్యాలరీలు