Volkswagen Virtus సెడాన్ కారులో షికారు ఎంతో సౌకర్యవంతం.. ఫస్ట్ డ్రైవ్ రివ్యూ!
- జర్మనీకి చెందిన కార్ మేకర్ తాజాగా మిడ్ సైజ్ సెడాన్ ఫోక్స్‌వాగన్ వర్టస్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ సరికొత్త Virtus కారు నాలుగు ట్రిమ్‌లలో లభించనుంది. దీని ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 11.21 లక్షల నుంచి ప్రారంభమై, రూ. 17.91 లక్షల వరకు ఉన్నాయి.
- జర్మనీకి చెందిన కార్ మేకర్ తాజాగా మిడ్ సైజ్ సెడాన్ ఫోక్స్‌వాగన్ వర్టస్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ సరికొత్త Virtus కారు నాలుగు ట్రిమ్‌లలో లభించనుంది. దీని ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 11.21 లక్షల నుంచి ప్రారంభమై, రూ. 17.91 లక్షల వరకు ఉన్నాయి.
(1 / 9)
Volkswagen Virtus కారు భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. ఇది మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా , స్కోడా స్లావియా వంటి కార్లతో పోటీపడనుంది.
(2 / 9)
ఫోక్స్‌వాగన్ వర్టస్ ప్రయాణికుల భద్రత, సౌకర్యం పరంగా టాప్ క్లాస్‌లో నిలుస్తుంది. ఈ Volkswagen Virtus కారు పొడవు 4,561 mm, వెడల్పు 1,752 mm అలాగే 2,651 mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది.
(3 / 9)
Virtus వెలుపలి భాగం డిజైన్ పరిశీలిస్తే సొగసైన L-ఆకారపు LED DRLలు, హెడ్‌లైట్ యూనిట్‌లతో వచ్చింది. క్రోమ్‌ని తగ్గించి బంపర్ లెండ్‌లో ఫాగ్ ల్యాంప్‌లతో విస్తృత ఎయిర్ డ్యామ్‌ను అందించారు.
(4 / 9)
ఫోక్స్‌వాగన్ వర్టస్ సెడాన్ వెనుక భాగం VW బ్యాడ్జ్‌తో పాటు ఆకర్షణీయమైన LED టెయిల్‌లైట్‌లతో ఉంది.
(5 / 9)
ఫోక్స్‌వాగన్ వర్టస్ కార్ బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో వచ్చింది. ఈ కార్ సైడ్ ప్రొఫైల్‌ను పరిశీలిస్తే చూడచక్కని షేప్ లైన్, క్రోమ్ గార్నిష్డ్ డోర్ హ్యాండిల్స్, టర్న్ ఇండికేటర్‌లు బ్లాక్ కలర్ B పిల్లర్‌తో పాటు బ్లాక్ ORVMలను ఇంటిగ్రేట్ చేసినట్లు ఉంది.
(6 / 9)
ఫోక్స్‌వాగన్ వర్టస్ క్యాబిన్ భాగం పరిశీలిస్తే ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌ను అందించడంతోపాటు దానిపై వివిధ రకాల కంట్రోల్ బటన్‌లు ఇచ్చారు. ఎదురుగా ఎనిమిది అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా ఉంది.
(7 / 9)
Virtusలో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇచ్చారు. ఇందులో Apple CarPlay, Android Auto ఉన్నాయి. ఇది డ్యాష్‌బోర్డ్, డోర్‌లపై ఉన్న బాడీ-కలర్ ట్రిమ్‌లతో డ్యూయల్-టోన్ పెయింట్ థీమ్‌ను కూడా కలిగి ఉంది. ముందు, వెనుక సీట్లకు ఆర్మ్‌రెస్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వెంట్‌లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఉన్నాయి.
(8 / 9)
ఫోక్స్‌వాగన్ వర్టస్ కారులో సౌకర్యంగా కూర్చోడానికి తగినంత స్థలంతో పాటు వెనకాల 521 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.
(9 / 9)
ఫోక్స్‌వాగన్ వర్టస్ పెట్రోల్ ఇంజన్‌ను మాత్రమే కలిగి ఉంది. ఇందులో 1.0-లీటర్ ఇచ్చారు. ఇది 115 PS శక్తిని విడుదల చేయగలదు. అలాగే 150 PS శక్తిని ఉత్పత్తి చేయగల శక్తివంతమైన 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోటారుతో కూడా అందుబాటులో ఉంది. ఇంకో ట్రిమ్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉండగా, టాప్ ఎండ్లో మోటారు 7-స్పీడ్ DST ఆటోమేటిక్ ఇంజిన్‌తో ప్రామాణికంగా వస్తుంది. ఇందులో డీజిల్ వేరియంట్ లేదు.
ఇతర గ్యాలరీలు