సూపర్​ కూల్​ ఫీచర్స్​తో వివో వీ50- ఇండియాలో లాంచ్​ డేట్​ ఇదే..-vivo v50 confirmed to launch in india check features and other details inside ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  సూపర్​ కూల్​ ఫీచర్స్​తో వివో వీ50- ఇండియాలో లాంచ్​ డేట్​ ఇదే..

సూపర్​ కూల్​ ఫీచర్స్​తో వివో వీ50- ఇండియాలో లాంచ్​ డేట్​ ఇదే..

Updated Feb 08, 2025 10:06 AM IST Sharath Chitturi
Updated Feb 08, 2025 10:06 AM IST

  • వివో వీ50ని ఇండియాలో లాంచ్​ చేస్తున్నట్టు దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ స్పష్టం చేసింది. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న వివో వీ40కి ఇది అప్డేటెడ్​ వర్షెన్​గా రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​పై ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి..

వివో వీ50 స్మార్ట్​ఫోన్​ ఈ ఫిబ్రవరి 17న ఇండియాలో లాంచ్​కానుంది. రోజ్ రెడ్, స్టార్రీ బ్లూ, టైటానియం గ్రే వంటి కలర్​ ఆప్షన్స్​లో ఈ గ్యాడ్జెట్​ అందుబాటులో ఉంటుంది.

(1 / 5)

వివో వీ50 వెనుక భాగంలో కీహోల్ ఆకారంలో ఉన్న కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇందులో రెండు కెమెరాలు ఉంటాయి. ఫ్రంట్ ఫేసింగ్, ప్రైమరీ కెమెరాలతో సహా మొత్తం మూడు కెమెరాలు 50 మెగాపిక్సెల్ సెన్సార్లను కలిగి ఉంటాయని వివో వెబ్సైట్ వెల్లడించింది. వీటిలో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. 

(2 / 5)

వివో వీ50 డిజైన్ వీ40ని పోలి ఉంది. ఈ ఫోన్ ఇప్పుడు మరింత రౌండ్​ స్ట్రక్చర్​ని కలిగి ఉంది, దీని డిస్​ప్లే డ్యూయెల్-కర్వ్డ్ ఎడ్జ్ ప్యానెల్ నుంచి క్వాడ్-కర్వ్డ్ ప్యానెల్​కి మారింది,

(3 / 5)

అదనంగా, వివో వీ50 ఇప్పుడు ఐపీ68, ఐపీ69 డస్ట్​, వాటర్​ రెసిస్టెన్స్​తో వస్తుంది. ఇది మునుపటి మోడల్ కంటే కీలక అప్​గ్రేడ్​.

(4 / 5)

ఈ వివో కొత్త స్మార్ట్​ఫోన్​ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్​తో వస్తుంది. ఫన్​టచ్​ ఓఎస్ 15పై పనిచేస్తుంది. ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 7 జెన్​ 3 ప్రాసెసర్​​ ఉంటుందని సమాచారం. ధరతో పాటు ఇతర వివరాలపై లాంచ్​ నాటికి మరింత క్లారిటీ వస్తుంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు