తెలుగు న్యూస్ / ఫోటో /
Meenakshi Chaudhary: మహేష్..దళపతి విజయ్..చిరంజీవి - స్టార్ హీరోలతో రొమాన్స్ - మీనాక్షి రేంజ్ మామూలుగా లేదుగా!
గుంటూరు కారం మూవీలో మహేష్‌బాబు మరదలిగా కనించింది మీనాక్షి చౌదరి. స్క్రీన్‌పై కనిపించింది తక్కువే అయినా తన లుక్స్‌తో మెస్మరైజ్ చేసింది. గుంటూరు కారం మినహా తెలుగులో విజయాలు లేకపోయినా స్టార్ హీరోలతో జోడీకట్టే అవకాశాలను దక్కించుకుంటోంది.
(1 / 5)
గుంటూరు కారం నుంచి పూజాహెగ్డే అర్ధాంతరంగా తప్పుకోవడంతో ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీ 300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
(2 / 5)
గుంటూరు కారం తర్వాత తెలుగులో మీనాక్షి చౌదరి మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. చిరంజీవి విశ్వంభరలో ఓ హీరోయిన్‌గా మీనాక్షి నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
(3 / 5)
విశ్వంభరలో త్రిషతో పాటు మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించనున్నట్లు తెలిసింది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో విశ్వంభర రిలీజ్ కాబోతోంది.
(4 / 5)
తమిళంలో దళపతి విజయ్‌తో రొమాన్స్ చేస్తోంది మీనాక్షి చౌదరి. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇతర గ్యాలరీలు