Nizamia Observatory Trip : హైదరాబాద్ పక్కనే ఉన్న 'నక్షత్రశాల' తెలుసా..? ఒక్క రోజులోనే చూసి రావొచ్చు
- Nizamia Observatory at Japal Rangapur : జాపాల - రంగాపూర్ అబ్జర్వేటరీ సింపుల్ గా జేఆర్ఓ అంటారు. ఇది హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలోని రంగాపూర్ గ్రామంలో ఉంటుంది. ఖగోళశాస్త్ర పరిశోధనలు జరుగుతుంటాయి. దీనికే నక్షత్రశాల అని కూడా పేరుంది.
- Nizamia Observatory at Japal Rangapur : జాపాల - రంగాపూర్ అబ్జర్వేటరీ సింపుల్ గా జేఆర్ఓ అంటారు. ఇది హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలోని రంగాపూర్ గ్రామంలో ఉంటుంది. ఖగోళశాస్త్ర పరిశోధనలు జరుగుతుంటాయి. దీనికే నక్షత్రశాల అని కూడా పేరుంది.
(1 / 7)
మైళ్ల దూరంలో ఉండే నక్షత్రాలను మనం తాకినట్లు.. జాబిల్లి రావే చందమామ రావే అనే చంద్రుడిని మన దగ్గరికే పిలిచినట్లు.. ఇలా ఒకటా రెండా... ఎన్నో వింతలు విశేషాలను తనలో పైలంగా దాచిపెట్టుకుని దశాబ్దాల చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా దర్శనమిసోంది జేఆర్ఓ(జాపాల - రంగాపూర్ అబ్జర్వేటరీ) సెంటర్…!
(Photo Source @Shanti_Vineet OU Professor Twitter)(2 / 7)
6వ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్.. 1907వ సంవత్సరంలో బేగంపేటలో నిజామియా అబ్జర్వేటరీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇది ఉస్మానియా వర్శిటీ పరిధిలోకి వెళ్లింది. అయితే ఖగోళ పరిశోధనలకు అనువుగా ఎత్తైన ప్రాంతం ఉండాలి. ఈ పరిస్థితుల్లో ఈ అబ్జర్వేటరీని హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లే దారిలో ఉన్న రంగాపూర్ - జాపాల గ్రామాల మధ్య ఓ పెద్ద కొండపైకి షిఫ్ట్ చేశారు. 200 ఎకరాల్లో ఉంటుంది.
(Photo Source @Shanti_Vineet OU Professor Twitter)(3 / 7)
ఈ జేఆర్వో ఏర్పాటైన ప్రాంతం… హైదరాబాద్ కంటే చాలా ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. ఫలితంగా పరిశోధనలకు మరింత అనుకూలంగా మారింది. రెండు గ్రామాల పేరుతో వచ్చేలా దీనికి జాపాల్ రంగాపూర్ అబ్జర్వేటరీగా పేరు పెట్టారు. స్థానికులు ఎక్కువగా ‘చుక్కపురి పట్నం’ అని పిలుస్తారు.
(Photo Source @Shanti_Vineet OU Professor Twitter)(4 / 7)
జేఆర్ఓ ఏర్పాటు చేసిన కొద్దిరోజుల్లోనే సరికొత్త ఫలితాలను రాబట్టగలిగింది. అమెరికన్ శాత్రవేత్తలు కూడా ఇక్కడికి క్యూ కట్టారు. నిరంతం టెలిస్కోప్ తో నక్షత్రాలు, గ్రహాల్ని తిలకించటం మొదలుపెట్టారు. ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ అస్ట్రానమితో పాటు పలు ప్రఖ్యాత సంస్థలు కూడా ఈ సెంటర్ పై ఆసక్తిని చూపాయి. ఎన్నో ఆసక్తిరమైన విషయాలతో పాటు సాంకేతికతను అందిపుచ్చుకున్న జేఆర్ఓ... 48 ఇంచుల టెలిస్కోప్ ఉండటంతో సౌత్ ఆసియాలోనే రెండో స్థానంలో నిలిచింది..1984-86 మధ్య కాలంలో హేలీ తోక చుక్కపై పరిశోధనలు, 1994లో షూమేకర్ లేవీ ప్రభావంపై కూడా పలు అంశాలను ఈ సెంటర్ నుంచి రికార్డు చేశారు.
(Photo Source @Shanti_Vineet OU Professor Twitter)(5 / 7)
దాదాపు ఇక్కడ పరిశోధనలకు సంబంధించి.. 130కి పైగా వ్యాసాలు అంతర్జాతీయ, జాతీయ పబ్లికేషన్లలో ప్రచురితమమయ్యాయి. వందలాది మంది పీహెచ్డీ విద్యార్థులు...ఈ సెంటర్ పాత్రపై కూడా వారి పరిశోధన టాపిక్ గా ఎంచుకున్నారు. ఉస్మానియా వర్శిటీ అస్ట్రామనీ విద్యార్థులు ఇక్కడే ప్రాక్టికల్స్ చేస్తుంటారు. థియరీ క్లాస్ లు ఓయూలో జరిగినప్పటికీ… ప్రాక్టికల్స్ కోసం మాత్రం ఇక్కడికి వస్తుంటారు.
(Photo Source @Shanti_Vineet OU Professor Twitter)(6 / 7)
ఇక్కడ పెద్ద గ్లోబ్ మాదిరిగా సెంటర్ నెలకొల్పి ఉంటుంది. ఇదంతా ఆదిత్య 369 సినిమాలో చూపించే గ్లోబ్ లా ఉంటుంది. లోపల ఉండే టెలిస్కోప్ తో నక్షత్రాలను చూపిస్తారు. ఎన్నో మైళ్ల దూరంలో ఉండే నక్షత్రాలు మనం చేతితో పట్టుకునే అంత దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాయి.
(7 / 7)
ఈ సెంటర్ ను చూడాలంటే ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లాలి. అక్కడ్నుంచి మంచాల్ నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. లేదా గునగల్ గ్రామం నుంచి కూడా రంగాపూర్- జాపాల్ అబ్జర్వేటరీ కొండకు చేరుకోవచ్చు. పబ్లిక్ హాలీ డే ఉన్న రోజుల్లో కేంద్రం మూసి ఉంటుంది. ఖగోళ శాస్త్ర పరిశోధనలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కేంద్రాన్ని సందర్శిస్తే ఎన్నో విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి 50 కి.మీ దూరంలో ఉంటుంది. గంటన్నరలో ఇక్కడికి చేరుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు