virat vs kane: విరాట్ వర్సెస్ విలియమ్సన్.. కోహ్లి రికార్డును బద్దలుకొట్టిన కేన్ మామ.. ఆ స్టాట్స్ చూసేయండి
virat vs kane: ట్రై సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో వన్డేలో సెంచరీ సాధించిన కేన్ విలియమ్సన్ ఓ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 7000 పరుగులు చేసిన సెకండ్ ఫాస్టెస్ట్ క్రికెటర్ గా కోహ్లి రికార్డును బద్దలుకొట్టాడు.
(1 / 5)
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ వన్డేల్లో 7000 పరుగులు పూర్తి చేశాడు. ట్రై సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో వన్డేలో కేన్ మామ ఈ ఫీట్ అందుకున్నాడు. ఆ మ్యాచ్ లో అతను అజేయ శతకంతో చెలరేగాడు. 113 బంతుల్లో 133 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.
(AFP)(2 / 5)
దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన కేన్ మామ ఈ క్రమంలో ఓ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్ గా అతను నిలిచాడు. 159 ఇన్నింగ్స్ లో కేన్ ఈ మైలురాయి చేరుకున్నాడు. అగ్ర స్థానంలో దక్షిణాఫ్రికా దిగ్గజం హషీం ఆమ్లా (150 ఇన్నింగ్స్) ఉన్నాడు.
(AFP)(3 / 5)
అత్యంత వేగంగా వన్డేల్లో 7 వేల పరుగులు చేసిన ఆటగాళ్లలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కేన్ విలియమ్సన్ వెనక్కి నెట్టాడు. 161 ఇన్నింగ్స్ ల్లో 7 వేల పరుగులు కంప్లీట్ చేసిన కోహ్లి సెకండ్ ప్లేస్ లో ఉండేవాడు. ఇప్పుడు విలియమ్సన్ 159 ఇన్నింగ్స్ ల్లోనే ఆ ఫీట్ అందుకుని రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
(Surjeet Yadav)(4 / 5)
వన్డేల్లో 7 వేలు పరుగులు చేసేటప్పటికీ కోహ్లి 24 సెంచరీలు చేశాడు. 36 హాఫ్ సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు. విలియమ్సన్ ఏమో 14 శతకాలు నమోదు చేశాడు. 46 అర్ధశతకాలు అందుకున్నాడు. అప్పుడు కోహ్లి సగటు 51.43 కాగా.. ఇప్పుడు కేన్ యావరేజ్ 49.65 గా ఉంది.
(PTI)ఇతర గ్యాలరీలు