Virat Kohli Record: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి.. బ్రాడ్‌మన్, సచిన్ రికార్డులను తిరగరాయనున్న స్టార్
- Virat Kohli Record: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చరిత్రకు అడుగు దూరంలో నిలిచాడు. బంగ్లాదేశ్ తో సిరీస్ లో అతడు ఊహించిన విధంగా రాణిస్తే ఏకంగా మూడు అరుదైన రికార్డులను తిరగరాయనున్నాడు. అందులో సచిన్, బ్రాడ్‌మన్ రికార్డులూ ఉన్నాయి.
- Virat Kohli Record: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చరిత్రకు అడుగు దూరంలో నిలిచాడు. బంగ్లాదేశ్ తో సిరీస్ లో అతడు ఊహించిన విధంగా రాణిస్తే ఏకంగా మూడు అరుదైన రికార్డులను తిరగరాయనున్నాడు. అందులో సచిన్, బ్రాడ్‌మన్ రికార్డులూ ఉన్నాయి.
(1 / 5)
Virat Kohli Record: బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్టు సిరీస్ లో విరాట్ కోహ్లీ కనీసం మూడు వ్యక్తిగత రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది. లెజెండరీ డాన్ బ్రాడ్‌మన్ ను అధిగమించగలడు. సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ అంతర్జాతీయ రికార్డును బద్దలు కొట్టగలడు.
(2 / 5)
Virat Kohli Record: బంగ్లాదేశ్ తో జరిగే రెండు టెస్టుల సిరీస్ లో విరాట్ కోహ్లీ మొత్తం 152 పరుగులు చేస్తే టెస్టు కెరీర్లో 9000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. అదే జరిగితే నాలుగో భారతీయుడిగా విరాట్ ఈ మైలురాయిని అందుకోనున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 113 టెస్టుల్లో 191 ఇన్నింగ్స్ లొ 8848 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,265), సునీల్ గవాస్కర్ (10,122) మాత్రమే టెస్టుల్లో 9,000 పరుగులు చేసిన భారతీయులు.
(3 / 5)
Virat Kohli Record: బంగ్లాదేశ్ తో జరిగే రెండు టెస్టుల సిరీస్ లో కోహ్లీ సెంచరీ సాధిస్తే టెస్టు చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో డాన్ బ్రాడ్ మన్ ను అధిగమిస్తాడు. విరాట్ ఇప్పటివరకు 113 టెస్టుల్లో 191 ఇన్నింగ్స్ లో 29 సెంచరీలు చేశాడు. డాన్ బ్రాడ్ మన్ 52 టెస్టుల్లో 80 ఇన్నింగ్స్ ల్లో బ్యాటింగ్ చేసి 29 సెంచరీలు చేశాడు. ప్రస్తుతం బ్రాడ్‌మన్ తో సమానంగా ఉన్న విరాట్.. అతన్ని అధిగమించే అవకాశం ఈ సిరీస్ లో రానుంది.
(4 / 5)
Virat Kohli Record: బంగ్లాదేశ్ తో జరిగే రెండు టెస్టుల సిరీస్ లో విరాట్ కోహ్లీ 58 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో 27 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. అదే జరిగితే అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగవంతమైన బ్యాటర్ గా ఈ మైలురాయిని అందుకోనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 623 ఇన్నింగ్స్ లో 27 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు. కోహ్లీ ఇప్పటివరకు 591 ఇన్నింగ్స్ లో 26942 పరుగులు చేశాడు.
ఇతర గ్యాలరీలు