(1 / 5)
14 ఏళ్ల సుదీర్ఘ టెస్టు కెరీర్ కు విరాట్ కోహ్లి వీడ్కోలు పలికాడు. సోమవారం (మే 13) టెస్టు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011లో టెస్టుల్లో అడుగుపట్టాడు విరాట్.
(HT_PRINT)(2 / 5)
2011 నుంచి 2025 వరకు విరాట్ కోహ్లి టెస్టు కెరీర్ కొనసాగింది. 123 టెస్టుల్లో కింగ్ 9230 రన్స్ చేశాడు. 30 సెంచరీలు చేశాడు. 31 హాఫ్ సెంచరీలు బాదాడు. అతని అత్యధిక స్కోరు 254.
(PTI)(3 / 5)
విరాట్ కోహ్లి టెస్టు కెరీర్ ను మూడు పార్ట్ లుగా డివైడ్ చేయొచ్చు. 2011 నుంచి 2015 వరకు కోహ్లి 41 టెస్టులాడాడు. 44.02 సగటుతో 2994 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలున్నాయి.
(PTI)(4 / 5)
2016 నుంచి 2019 వరకు విరాట్ కోహ్లీలోని పీక్ దశ. ఈ పీరియడ్ లో 43 టెస్టులాడిన విరాట్ 4208 పరుగులు చేశాడు. అతని సగటు 66.79గా ఉండటం విశేషం. ఏకంగా 16 సెంచరీలు చేశాడు. ఈ టైమ్ లోనే ప్రపంచ క్రికెట్లో గొప్ప బ్యాటర్లలో ఒకడిగా విరాట్ ఎదిగాడు.
(HT_PRINT)(5 / 5)
కరోనా బ్రేక్ తో విరాట్ కెరీర్ కూ బ్రేక్ పడింది. 2020 నుంచి 2025 వరకు పేలవ దశ చూశాడు కోహ్లి. 39 మ్యాచ్ ల్లో 2028 పరుగులే చేశాడు. అతని సగటు 30.72కు పడిపోయింది. కేవలం 3 సెంచరీలు మాత్రమే చేయగలిగాడు. చివరకు గుడ్ బై చెప్పేశాడు.
(AP)ఇతర గ్యాలరీలు