టెస్టు క్రికెట్‌ను మార్చిన యోధుడు.. స్ఫూర్తి రగిలించే వీరుడు.. కోహ్లి క్రికెటర్ మాత్రమే కాదు.. రియల్ కింగ్!-virat kohli test retirement he rediscovers long format cricket with his passion and presence no one will be like him ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  టెస్టు క్రికెట్‌ను మార్చిన యోధుడు.. స్ఫూర్తి రగిలించే వీరుడు.. కోహ్లి క్రికెటర్ మాత్రమే కాదు.. రియల్ కింగ్!

టెస్టు క్రికెట్‌ను మార్చిన యోధుడు.. స్ఫూర్తి రగిలించే వీరుడు.. కోహ్లి క్రికెటర్ మాత్రమే కాదు.. రియల్ కింగ్!

Published May 12, 2025 04:08 PM IST Chandu Shanigarapu
Published May 12, 2025 04:08 PM IST

టెస్టు క్రికెట్ చరిత్రలో ఎంతో మంది ఆటగాళ్లు వచ్చారు, వెళ్లిపోయారు. కానీ కింగ్ విరాట్ కోహ్లి మాత్రం ఒక్కడే. అతనిలా టెస్టు క్రికెట్ పై ప్రభావం చూపిన, ఈ ఫార్మాట్ కే క్రేజ్ పెంచిన ఆటగాడు ఇంకెవరూ లేరు.

టెస్టు క్రికెట్ అంటే బోరింగ్. అయిదు రోజులు మ్యాచ్ ను చూసే ఓపిక ఉంటుందా? రోజంతా గేమ్ అంటే కష్టమే.. ఇలాంటి ఫ్యాన్స్ ను తన క్రేజ్ తో మార్చేశాడు విరాట్ కోహ్లి. గ్రౌండ్ లో తన మ్యాజిక్ తో టెస్టు ఫార్మాట్ కే ఆదరణ పెంచాడు అతడు. అతని కోసం మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ టెస్టులు చూసేందుకు ఫ్యాన్స్ స్టేడియాలకు పోటెత్తేవాళ్లు.

(1 / 5)

(AP)

శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న టెస్టు క్రికెట్ ను కొన్ని వేల మంది ఆటగాళ్లు ఆడి ఉంటారు. కానీ అందులో విరాట్ కోహ్లి మాత్రం స్పెషల్. ఏదో వచ్చామా.. ఆడామా.. వెళ్లామా అన్నట్లు ఉంటే కోహ్లి యోధుడిగా నిలిచేవాడే కాదు. గ్రౌండ్ లో తన బ్యాటింగ్ తో, కెప్టెన్సీతో, నెవర్ గివప్ యాటిట్యూడ్ తో టెస్టు క్రికెట్ తిరిగి లైఫ్ ఇచ్చాడు విరాట్.

(2 / 5)

(ANI Picture Service Wire)

కోహ్లి కేవలం ఆటగాడు మాత్రమే కాదు అంతకుమించి. బ్యాటింగ్ లో కొత్త ప్రమాణాలు నెలకొల్పాడు. ఆడితే కోహ్లీలా ఆడాలనే బెంచ్ మార్క్ సెట్ చేశాడు. కెప్టెన్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత మరింత చెలరేగిపోయాడు. ఏ కెప్టెన్ అయినా ప్రెషర్ ఫీల్ అవుతారు. కానీ విరాట్ మాత్రం నాయకుడిగా బ్యాటింగ్ రెచ్చిపోయి తోటి ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు.

(3 / 5)

అగ్రెషన్ కు పెట్టింది పేరు కోహ్లి. టీమిండియా ప్లేయర్లు అంటే సాఫ్ట్ గా ఉంటారనే ఒపీనియన్ ను మార్చేశాడు విరాట్. మాటకు మాట చెప్తామంటూ కోహ్లి దూకుడుతో టీమ్ నే మార్చేశాడు. స్లెడ్జింగ్ కు మారుపేరైనా ఆస్ట్రేలియానే కోహ్లిని చూసి భయపడింది. భారత్ తో టెస్టు సిరీస్ సందర్భంగా విరాట్ ను రెచ్చగొట్టొందని ఆ టీమ్ కు మాజీలు ఎన్నోసార్లు సూచించారు.

(4 / 5)

(AFP)

టీమిండియా ఆటగాళ్ల ఫిట్ నెస్ విరాట్ కు ముందు, ఆ తర్వాత అనేలా మారింది. అత్యుత్తమ ఫిట్ నెస్ తో కోహ్లి భారత క్రికెట్లో కొత్త స్టాండర్డ్స్ క్రియేట్ చేశాడు. గ్రౌండ్ లో చిరుత వేగంతో సహచర ఆటగాళ్లలోనూ స్ఫూర్తి రగిలించాడు. ఫిట్ నెస్ అంటే కోహ్లీలా ఉండాలనే బ్రాండ్ సెట్ చేశాడు. ఇప్పుడు టీమిండియా ప్లేయర్లు టాప్ లెవల్ ఫిట్ నెస్ తో కొనసాగుతున్నారంటే కోహ్లి కారణమని చెప్పొచ్చు.

(5 / 5)

(PTI)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు